బీసీసీఐ కొత్త 10-పాయింట్ల విధానంపై పీటీఐ ఓ కీలక నివేదికను విడుదల చేసింది. భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలో జరగనుంది. దీంతో, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) బీసీసీఐ మార్గదర్శకాలను అమలు చేయడం ప్రారంభించింది.CAB అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, అసోసియేషన్ బోర్డు విధించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తోందని తెలిపారు.
ఈ కొత్త పాలసీ ప్రకారం, ఆటగాళ్లకు ఎలాంటి ప్రత్యేక వాహనాలు అందించబడవు.అందరూ టీమ్ బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది.CAB కొత్త మార్గదర్శకాల ప్రకారం, టీమ్‌కి ఎలాంటి ప్రత్యేక ప్రయివేటు వాహనాలను ఏర్పాటు చేయబడదని గంగూలీ వెల్లడించారు. ప్రతి ఆటగాడు టీమ్ బస్సులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది టీమ్ స్పిరిట్‌ను పెంచడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు.స్నేహాశిష్ గంగూలీ మాట్లాడుతూ, బీసీసీఐ రూపొందించిన మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తున్నామని తెలిపారు. జట్టు నుంచి ఎవ్వరూ విడిగా ప్రయాణించరాదని స్పష్టం చేశారు.
మ్యాచ్‌లు లేదా ప్రాక్టీస్ సెషన్లకు కూడా ఆటగాళ్లందరూ బస్సులోనే వెళ్లాలనే నిబంధనను అమలు చేస్తోంది CAB.కొత్త పాలసీ కేవలం ఆటగాళ్ల ప్రయాణానికి మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులు, దేశవాళీ క్రికెట్ సంబంధించి కూడా సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తరువాత, భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ఇదే మొదటిది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతోంది. CAB ఈ విధానాలను అమలు చేసిన తొలి రాష్ట్ర క్రికెట్ సంఘంగా నిలిచింది. జనవరి 22: తొలి టీ20 – కోల్‌కతా జనవరి 25: రెండో టీ20 – చెన్నై జనవరి 28: మూడో టీ20 – రాజ్‌కోట్ బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు టీమిండియాకు ఒత్తిడిగా మారినా, దీని ద్వారా జట్టు ఐక్యతను మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.