perninaniwife

బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్చి నాని సతీమణి ముందస్తు బెయిల్

బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్చి నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటీషన్ పై మచిలీపట్నం జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జయసుధ, ప్రభుత్వం తరపున వాదనలు పూర్తయ్యాయి, దీంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రకటించింది. డిసెంబర్ 30వ తేదీన దీనిపై తీర్పు ఇస్తామని మచిలీపట్నంలోని జిల్లా కోర్టు స్పష్టం చేసింది. జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అయితే డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. ఈ అంశంలో తామే ముందు కనుగోని.. ప్రభుత్వానికి చెప్పామని.. అనంతరం అధికారులు మెల్కొన్నారని తెలిపారు. ఇక వే బ్రిడ్జి లో సాంకేతిక సమస్య కారణంగా తూకంలో సైతం తేడా వచ్చిందని కోర్టు లో ఈ సందర్భంగా న్యాయవాదులు వివరించారు. ఆ క్రమంలో ఈ కేసులో జయసుధకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే బియ్యం మాయం అయినట్లు నేరుగా వారే అంగీకరించడం.. ఆ క్రమంలో నోటీసుల జారీ చేసిన నేపథ్యంలో రూ. కోటి 70 లక్షలు ప్రభుత్వానికి చెక్కు ద్వారా చెల్లించారని కోర్టుకు గుర్తు చేశారు. నేరం చేసి.. నగదు చెల్లించామని.. దీంతో కేసు మాఫీ చేయాలంటూ కోరుతున్నట్లుగా జయసుధ తరపు న్యాయవాదులు చెబుతున్నట్లుగా ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పష్టం చేశారు. ఈ ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. ఈ తీర్పును రిజర్వు చేస్తున్నట్లు తెలిపింది. ఆ క్రమంలో డిసెంబర్ 30వ తేదీన దీనిపై తీర్పు వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది

Related Posts
బడ్జెట్ తర్వాత ఎమ్మెల్యేలతో బాబు భేటీ
బడ్జెట్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు కీలక భేటీ

ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమంతో పాటు పలు రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో Read more

కడప జిల్లాలో “మహానాడు” : అచ్చెన్నాయుడు
"Mahanadu" in Kadapa District : Atchannaidu

అమరావతి: టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే "మహానాడు" కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో Read more

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు: జగన్
ys jagan

ఏపీ ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.చంద్రబాబును విమర్శిస్తూ ఎక్స్ లో జగన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం Read more

మహిళల అత్యవసర సమయాల్లో 181 ఫ్రీ సేవలు: మంత్రి నాదెండ్ల
మహిళల అత్యవసర సమయాల్లో 181 ఫ్రీ సేవలు: మంత్రి నాదెండ్ల

ఏలూరులో సీఆర్ఆర్ కాలేజిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు ఒక అద్భుతమైన సందర్భంగా మారాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు మరియు Read more