Fainjal effect . Flights f

ఫెయింజల్ ఎఫెక్ట్ .. హైదరాబాద్‌ నుంచి విమానాలు బంద్‌

ఫెంగల్ తుపాను దెబ్బకు హైదరాబాద్‌ నుంచి విమానాలు రద్దయ్యాయి. ఫెయింజల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్‌ రావాల్సిన మూడు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్‌ లైన్స్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇటు హైదరాబాద్‌ నుంచి నడవాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్‌ విమానాలను రద్దు చేశారు. అలాగే, ఏపీ తిరుపతిలోనూ విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు పది విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ముంబై, త్రిపుర వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.

Advertisements

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను మహాబలిపురం దగ్గరలో శనివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుఫాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం తుఫాను అత్యంత నెమ్మదిగా కదులుతున్నదని.. గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లుగా పేర్కొంది. పూర్తిగా తీరం పైకి వచ్చి తర్వాత బలహీనపడే అవకాశం ఉందని.. రాత్రి 11.30 గంటల సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. అల్పపీడనం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కి. మీ వేగంతో గాలులు వీస్తాయి. మధ్యలో గంటకు 75 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. తుపాను నేపథ్యంలో, ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిరంతరం ఏపీ సర్కార్​కు నిరంతరం సంకేతాలను అందిస్తోంది. ఇండియాకు చెందిన ఇన్సాట్​-3డీఆర్​, ఈవోఎస్​ -06 శాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు పెంగల్​​ తుపాను స్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్రో అందిస్తోంది. దీంతో విపత్తుల కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇస్రో, ఏపీ గవర్నమెంట్​ను అలర్ట్​ చేయగా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Related Posts
సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్‌ కానిస్టేబుల్ కుటుంబాలు
families of the battalion constables who besieged the secretariat

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని జిల్లాల్లో కొన్ని రోజులుగా సాగుతున్న బెటాలియన్‌ పోలీసుల కుటుంబాల ఆందోళనలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు రాష్ట్రంలో కానిస్టేబుల్‌ భార్యలు తమ Read more

ATACMS ద్వారా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రం
ATACMCUS

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్‌కు రష్యా సరిహద్దులో ATACMS క్షిపణి ఉపయోగించే అనుమతిని ఇచ్చారు. ATACMS అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. ఇది తక్కువ సమయంతో Read more

హైదరాబాద్‌లో చికెన్, గుడ్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం
హైదరాబాద్‌లో చికెన్, గుడ్లు ఫ్రీ.. ఎగబడ్డ జనం

బర్డ్‌ ఫ్లూ భయాన్ని తరిమికొట్టేందుకు ఫౌల్ట్రీ ఫెడరేషన్ శ్రీకారం చుట్టింది. ప్రజల్లో బర్డ్‌ ఫ్లూ ఫియర్‌ను తొలగించడమే లక్ష్యంగా చికెన్‌ మేళాలు ఏర్పాటు చేసింది. ఈ మేళాల్లో Read more

సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు
సిద్ధం అవుతున్న సంక్రాంతి పుంజులు

సంక్రాంతి పండుగ అంటే కోడి పందేల సందడి. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోడి పందేలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ పందేల కోసం రాష్ట్రంలోని వివిధ Read more

×