world oldest man john alfre

ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జాన్ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో 1912 ఆగస్టు 26న జన్మించిన టిన్నిస్‌వుడ్.. షెల్, బీపీ కంపెనీల్లో అకౌంటెంట్‌గా పనిచేసి1972లో ఉద్యోగ విరమణ పొందారు.

ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకున్న జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ గిన్నిస్‌ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. సౌత్‌పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆయనకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ బృందం ఈ ఏడాది ఏప్రిల్​లో సర్టిఫికెట్‌ అందజేసింది. అయితే, సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన అప్పుడు చెప్పడం గమనార్హం. చారిత్రక విషాదమైన టైటానిక్‌ ఓడ మునిగిన 1912లో జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ జన్మించారు. టైటానిక్‌ నౌక మునిగిన కొన్ని రోజులకే పుట్టిన ఆయన తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన, ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ జీవన విధానమే కారణమని చెప్పేవారు.

జాన్‌ ఆల్ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ అలవాట్ల విషయానికి వస్తే..ఎప్పుడూ ధూమపానం చేయలేదు. మద్యం మాత్రం అప్పుడప్పుడు తీసుకునేవారు. ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్‌ తీసుకోవడం తప్పితే ప్రత్యేకంగా ఎటువంటి డైట్‌ పాటించలేదు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమార్తె సుసాన్, నలుగురు మనవళ్లు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. భార్య బ్లాడ్వెన్ 1986లోనే మరణించారు.

Related Posts
మహాకుంభమేళా : రోజూ లక్ష మంది ఆకలి తీరుస్తున్న ఇస్కాన్
ISKCON, Adani Group provide

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులు, వర్కర్ల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్ సంస్థ అదానీ గ్రూప్‌తో చేతులు కలిపింది. రోజువారీ లక్ష మందికి పైగా భక్తులకు ఆహారాన్ని అందించడం Read more

మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ ప్రారంభం
Swachh Andhra Swachh Diva

కడప జిల్లా మైదుకూరులో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. Read more

అప్పుడు రయ్ రయ్.. ఇప్పుడు నై నై అంటే ఎలా చంద్రబాబు? – వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ , వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా టీడీపీ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు గతంలో Read more

రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన పై ఎమ్మెల్యే వివేకానంద విమర్శలు
cm revanth singapore tour

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రాష్ట్రానికి ఎలాంటి లాభం చేకూర్చలేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు Read more