ys Jagan will have an important meeting with YCP leaders today

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కోర్ట్ లో జగన్ పిటిషన్…

తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 175 కు 175 కొట్టబోతున్నాం అంటూ గొప్పగా ప్రచారం చేస్తే..ప్రజలు మాత్రం 11 కు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడును సైతం కోరారు. కానీ ఎలాంటి స్పందన రాకపోవడం తో కోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌పై కోర్టు విచారణ దశలో ఉంది.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అయితే ఈ సమావేశానికి సైతం జగన్ హాజరుకాలేదు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతోనే ఆయన అసెంబ్లీకి వెళ్లలేదని తెలుస్తోంది.

ఇక ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశ పెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం జరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2లక్షల34 వేలకోట్లుగా మూలధన వ్యయాన్ని 32 వేల 712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34 వేల 743 కోట్లు, ద్రవ్య లోటు 68 వేల 743 కోట్లుగా ఉండొచ్చని, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి – జీఎస్​డీపీలో రెవెన్యూ లోటు 4.19 శాతం, ద్రవ్య లోటు 2.12 శాతంగా ఉండొచ్చని వివరించారు. అలాగే ఉన్నత విద్యకు 2వేల 326 కోట్లు, ఆరోగ్యరంగానికి 18 వేల 421 కోట్లు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు , సంక్షేమానికి, అందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా 39వేల 7 కోట్లు కేటాయించారు.

ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7వేల 557 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4 వేల 376 కోట్లు ప్రతిపాదించారు. మహిళా శిశుసంక్షేమ శాఖకు 4వేల285 కోట్లు దక్కాయి. ఇక కీలకమైన పాఠశాల విద్యాశాఖకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు 29 వేల 909 కోట్లు, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధిక కల్పనకు కీలకమైన నైపుణ్యాభివృద్ధి శాఖకు 12 వందల 15 కోట్లు కేటాయించారు.

Related Posts
Tollgate : రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!
రహదారులపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు!

దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను తీసుకువస్తోంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల Read more

లార్నూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదుల హతం
Another encounter in Jammu and Kashmir 1

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. ఆపరేషన్‌లో భాగంగా అనంతనాగ్‌ లోని లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారం నాడు మట్టుబెట్టాయి. అనంతనాగ్ ఆర్మీ జవాన్ Read more

యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఆధ్వర్యంలో యూరోపియన్ నాయకులు సోమవారం పారిస్‌లో అత్యవసర భద్రతా సమావేశానికి హాజరయ్యారు. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Read more

కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
Srivari's Kalyanaratham leaving for Prayagraj Kumbh Mela

తిరుమల: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరింది. కల్యాణ రథంకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం Read more