case file on posani

పోసాని పై వరుస కేసులు

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని కొంతమంది రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. తమ స్థాయిని మరచిపోయి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , లోకేష్ ఇలా ఎవర్ని పడితే వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం..వీడియోలు పోస్ట్ చేయడం , ట్రోల్స్ చేయడం వంటివి చేసారు..ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..సైలెంట్ గా ఉంటుందా..వరుసపెట్టి కేసులు పెడుతుంది. ముఖ్యంగా పోసాని , శ్రీ రెడ్డి పై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ టీడీపీ నాయకులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలకొండ టీడీపీ నేతలు బొగాది వెంకటరమణ, అనాపు జవరాజు, కూటమి కార్యకర్తలు ఎస్‌ఐకి ఫిర్యాదు అందజేశారు. టీటీడీ ఛైర్మన్‌ను అభ్యంతకర పదజాలంతో దూషించిన పోసాని కృష్ణమురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్​లోనూ పోసానిపై టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని పైకేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటు శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పార్టీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి సైతం పోసాని పై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా లో నారా లోకేశ్, టీడీపీ నాయకులపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోసానిపై పాతపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఇక శ్రీరెడ్డిపై కూడా కృష్ణా జిల్లా గుడివాడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, అనితలపై సోషల్ మీడియా లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం టీడీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేశారు.

Related Posts
కుటుంబ సభ్యులను గుర్తుపట్టని శ్రీ తేజ..!
sri teja health bulletin re

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ ఆరోగ్యంపై కిమ్స్ ఆసుపత్రి తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. పుష్ప 2 Read more

ఇక నుండి మీ సేవ కేంద్రాల్లోను రేషన్ కార్డుల దరఖాస్తులు
meeseva

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై లబ్ధిదారులు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో రేషన్ Read more

సీఎం చంద్రబాబుతో డీజీపీ గుప్తా భేటీ
DGP Gupta met with CM Chand

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా Read more

CBN -Pawan : సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
Deputy CM Pawan Kalyan meet CM Chandrababu today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది. తాజాగా ముగిసిన క్యాబినెట్ Read more