perni nani

పేర్నినాని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు కావడంతో ఆయన హై కోర్టును ఆశ్రయంచారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను ఏ6గా పేర్కొన్నారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో ఆయన లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పేర్ని నాని పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిటిషన్ ను విచారించనుంది.

బెయిల్ పై వున్న జయసుధ

ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైల్లో ఉన్నారు.. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదయింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Related Posts
ఏపీలో నేటి నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ
Acceptance of application for new ration card in AP from today

అమరావతీ: ఏపీ ఈరోజు నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల Read more

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు
NEW PHC

ఏపీలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది Read more

వైసీపీలోకి శైలజానాథ్
Sailajanath

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన Read more

రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Minister Atchannaidu introduced the agriculture budget with Rs.43402 crores

అమరావతి: ఏపీ అసెంబ్లీలో సోమవారం వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిదని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *