earthquake

పెరుగుతున్న భూకంపం మృతుల సంఖ్య

టిబెట్‌ను భారీ భూకంపం వణికిస్తోంది. ఇవాళ ఉదయం కేవలం గంట వ్యవధిలోనే టిబెట్‌ ప్రాంతంలో ఆరుసార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. పెను భూకంపం ధాటికి ఇప్పటి వరకూ 95 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 130 మంది గాయపడ్డారు.

Advertisements

టిబెట్‌ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. నేపాల్‌ – టిబెట్ సరిహద్దుల్లో ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ తర్వాత స్వల్ప తీవ్రతతో పలుమార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా ఈ భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య వందకు చేరువైంది.

నేపాల్‌ – టిబెట్‌ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన మానిట‌రింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రత‌ను 6.8గా పేర్కొన్నది. టిబెల్ రాజ‌ధాని లాసాకు సుమారు 380 కిలోమీట‌ర్ల దూరంలో భూమి కంపించిన‌ట్లు తెలుస్తోంది.
భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. ఢిల్లీ ఎన్సీఆర్‌, బెంగాల్‌, బీహార్‌, అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు పలు ప్రాంతాల్లోనూ ప్రకంపణలు సంభవించాయి. బీహార్‌లో ఆందోళనకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. ఇక చైనా, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.

Related Posts
దక్షిణ కొరియా అధ్యక్షుడిపై నేరాభియోగాలు
Criminal charges against South Korean president

నేరారోపణలు రుజువైతే మరణ శిక్ష లేదా యావజ్జీవ కారాగారవాస శిక్ష.. సియోల్‌ : అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌పై నేరాభియోగాలను ఆదివారం Read more

వెయిట్‌లిఫ్టింగ్ లో 90 ఏళ్ల వృద్ధురాలి ప్రతిభ..
weightlifting

తైవాన్‌లోని తైపీ నగరంలో 70 ఏళ్ల పైబడి వయస్సు ఉన్నవారి కోసం నిర్వహించిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో 90 ఏళ్ల వృద్ధురాలైన చెంగ్ చెన్ చిన్-మీ అద్భుతమైన ప్రదర్శన Read more

బ్రెజిల్‌లో విమానం ప్రమాదం : 10 మంది మృతి
brazil plane crash

బ్రెజిల్‌లోని గ్రామడో నగరంలో ఒక చిన్న విమానం దురదృష్టవశాత్తు ప్రమాదం చెందింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 10 మంది మృతిచెందారు. అధికారులు ప్రకారం, ఈ విమానం Read more

కోర్టు విచారణకు హాజరైన దక్షిణ కొరియా అధ్యక్షుడు
South Korean president attended the court hearing

రెండు కేసుల్లో వేర్వేరు కోర్టుల్లో విచారణ సియోల్ : అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌-యెల్‌ గురువారం కోర్టుల్లో విచారణకు హాజరయ్యారు. దేశంలో అత్యవసర Read more

×