సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ల వద్ద చేరుకున్నారు. కాగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడంతో ఓ బాలుడికి ఉపిరిడక స్పృహ తప్పిపడిపోయాడు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు బాలుడ్ని దగ్గరలోని హాస్పటల్ లో జాయిన్ చేసారు. ఈ బాలుడి ఎవరు..? ఎక్కడి నుండి వచ్చాడు..? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.ఈరోజు రాత్రి 9.30 తర్వాత పుష్ప 2 ప్రీమియర్స్ మొదలయ్యాయి. దాదాపు 3 ఏండ్ల తర్వాత అల్లు అర్జున్ సినిమా థియేటర్లో విడుదల కానుడటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే నటుడు అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు థియేటర్స్ లలో ప్రీమియర్ షోస్ చూస్తున్నారు.
అల్లు అర్జున్‌తో పాటు అల్లు ఫ్యామిలీకి చెందిన వారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో సినిమా చూస్తున్నాడు. దర్శకుడు రాజమౌళి నల్లగండ్లలోని అపర్ణలో, ఏషియన్ మహేశ్ బాబు థియేటర్‌లో మైత్రీ మేకర్స్ నిర్మాతలు , దిల్ రాజు, అనిల్ రావిపూడి తదితరులు శ్రీరాములు థియేటర్‌లో సినిమా చుస్తున్నట్లు సమాచారం. అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు అతడి సన్నిహితులు అమీర్‌పేటలోని ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్‌లో చూస్తున్నట్లు తెలుస్తుంది.