sithaka

పుష్ప సినిమాపై సీతక్క ఆగ్రహం

పుష్ప సినిమా పై రోజురోజుకు రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. కాంగ్రెస్, తెరాసల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. తాజాగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? అంటూ మండిపడ్డారు.
అవార్డులు రాలేదు
ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదన్నారు. కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఆక్షేపించారు.

Advertisements
pushpa cinema

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలను ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. మానవ హక్కులను కాపాడే లాయర్ జీరో అయినప్పుడు… స్మగ్లింగ్ చేసే నటుడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమాలో స్మగ్లర్ హీరో అని, కానీ స్మగ్లింగ్‌ను కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయన్నారు. రెండు మర్డర్లు చేసిన వ్యక్తిని పుష్ప-2 థియేటర్లో పట్టుకున్నారని వెల్లడించారు.
సందేశాత్మక చిత్రాలను ఆదరించాలి
సందేశాత్మక చిత్రాలు తీస్తేనే ప్రజలు ఆదరించాలని సూచించారు. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాల్సి ఉందన్నారు. సినిమాలను మేం గౌరవిస్తామని, సినిమాలు ఓ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే అన్నారు. కానీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనేది ముఖ్యమన్నారు. సినిమా నటులు లేదా నిర్మాతలు లేదా దర్శకులు ఈ సమాజాన్ని ఉన్నతస్థితికి తీసుకెళ్లే ఆలోచనలతో సినిమాలు తీయాలన్నారు.

Related Posts
IT corridor: ఐఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్..5 కి.మీ ఫ్లైఓవర్‌
IT corridor ఐఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్..5 కి.మీ ఫ్లైఓవర్‌

ఐటీ కారిడార్‌ ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైవంతెన నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ పైవంతెన ట్రిపుల్‌ ఐటీ చౌరస్తా, కోకాపేట ఓఆర్ఆర్‌ Read more

Tellam Venkat Rao: సీపీఆర్ చేసి కాంగ్రెస్ నేత‌ను కాపాడిన ఎమ్మెల్యే
సీపీఆర్ చేసి కాంగ్రెస్ నేత‌ను కాపాడిన డాక్టర్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో ఓ కాంగ్రెస్ నేతకు గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటన మంత్రి తుమ్మల నాగేశ్వరావు పర్యటన సందర్భంగా చోటుచేసుకుంది. ఈ Read more

బర్డ్ ఫ్లూ ప్రభావం.. మటన్, చేపల ధరలకు రెక్కలు
బర్డ్ ఫ్లూ ప్రభావం.. మటన్, చేపల ధరలు కొత్త రికార్డు

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాలు పెరిగిపోయాయి. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులు ఇప్పుడు తెలంగాణకూ విస్తరించాయి. కోళ్లు మృత్యువాత పడటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. Read more

బండి సంజయ్, రేవంత్ డ్రామా ఆడుతున్నారు – కేటీఆర్
sanjay ktr

గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం దారుణమని కేటీఆర్ అన్నారు. 'గ్రూప్-1 అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తోంది. సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సింది. బండి సంజయ్, రేవంత్ Read more

×