rambabu pawan

పవన్ కల్యాణ్‌కు నిజంగానే తిక్క ఉంది – అంబటి

కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అడ్డుకోవడంపైనా అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

కాకినాడలోని యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్‌ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ గుర్తించారు.మొత్తంగా ఆ బియ్యం విలువ 6 కోట్ల 64 లక్షల 60 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం (పీడీఎస్‌) అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతోందని జిల్లా కలెక్టర్‌కు పక్కాగా సమాచారం వచ్చింది.

వెంటనే ఆయన బార్జ్‌లు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్ట్, మెరైన్, రెవెన్యూ పౌర సరఫరాల బృందంతో కలిసి ఐదు నాటికల్‌ మైళ్ల (సుమారు తొమ్మిది కిలోమీటర్ల) దూరం సముద్రంలో ప్రయాణించి స్టెల్లా ఎల్‌ నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌక పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. సుమారు 52 వేల టన్నుల సామర్థ్యం ఉన్న ఈ నౌకలో 38 వేల టన్నుల బియ్యం లోడ్‌ కాగా అందులో 640 టన్నులు పీడీఎస్‌ బియ్యం అని గుర్తించారు.

ఇక ఈ విషయం తెలిసి స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి..అధికారులపై ఫైర్ అయ్యారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే.. దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని, అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు, దీని వెనకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న కింగ్ పిన్ లను గుర్తించాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేసారు. పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి..? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా..? అని అనుమానాలు వ్యక్తం చేసారు.

కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అడ్డుకోవడంపైనా అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. అప్పటికే కలెక్టర్‌ పట్టుకున్న రేషన్‌ బియ్యాన్ని చూడటానికి పవన్‌ కల్యాణ్‌ సాహసోపేతంగా వెళ్లారని ఎద్దేవా చేశారు. తీరా ఒడ్డుకు వచ్చిన తర్వాత విచిత్రమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. రెండు నెలల నుంచి అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారని.. వారు సహకరించడం లేదని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారని గుర్తుచేశారు. అసలు ఆయన ప్రభుత్వంలో ఉన్నారో.. లేదంటే ప్రశ్నించే పక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదని రాంబాబు చెప్పుకొచ్చారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికడతామని చెప్పిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌.. దీనికి బాధ్యత వహిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అధికారులు తనను అడ్డుకున్నారని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారని.. బహుశా చంద్రబాబు, నారా లోకేశ్‌ చెప్పడంతోనే అధికారులు అడ్డుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఉప ముఖ్యమంత్రికి అంతలా ప్రాధాన్యం ఇవ్వద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమోనని అన్నారు.

కూటమి నేతల సహకారంతోనే ఈ స్కామ్‌ జరుగుతుందని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్యే కొండబాబుకు మామూళ్లు వెళ్లకుండానే ఇదంతా జరుగుతుందా అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Related Posts
హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాదం
బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్తున్న రమణ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు Read more

భారతదేశం AI రంగంలో టాప్ 10లో, సాంకేతిక అభివృద్ధిలో ముందడుగు
INDIA AI

భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆవశ్యకత లో టాప్ టెన్ దేశాలలో ఒకటిగా నిలిచింది. ఇది దేశం యొక్క సాంకేతిక పురోగతికి కీలకమైన సూచన. AI రంగంలో Read more

నా భర్తకు ప్రాణహాని ఉంది :వంశీ భార్య
నా భర్తకు ప్రాణహాని ఉంది :వంశీ భార్య

విజయవాడ కోర్టు వైసీపీ నేత వల్లభనేని వంశీకి 14 రోజుల న్యాయవిధి కింద రిమాండ్ విధించింది. కిడ్నాప్, దాడి, బెదిరింపు కేసులో ఆయనపై ఆరోపణలు నమోదవగా, పోలీసులు Read more

ట్రంప్ – మస్క్ ఏఐ వీడియో: అమెరికా రాజకీయాల్లో కలకలం
టెస్లాపై దాడి చేస్తే 20ఏళ్లు జైలని ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న వేళ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై రూపొందించిన ఏఐ-సృష్టించిన వీడియో హల్‌చల్ సృష్టిస్తోంది. అమెరికా Read more