fire crackers blast

పటాకుల పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు మృతి

తరచుగా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవిస్తున్నా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నది. దీనితో అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్‌ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పటాకుల పేలుడు ధాటికి కార్మికులు కొన్ని మీటర్ల దూరం ఎగరిపడ్డారు. సమీపంలోని ఆరు ఇండ్లు ధ్వంసమయ్యాయి.

Advertisements


పోలీసులు సహాయక చర్యలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశామన్నారు.
కాగా, గతేడాది అక్టోబర్‌లో కూడా తిరువూరు జిల్లాలోని ఓ పటాకుల గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వారిలో 9 నెలల చిన్నారి కూడా ఉన్నది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 ఇండ్లకుపైగా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దానికి ప్రజలు భయంతో పరుగులు తీశారు.

Related Posts
టీ అమ్మే వ్యక్తి వల్ల రైలు ప్రమాదానికి కారణం: డిప్యూటీ సీఎం
deputy cm

మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో నిన్న ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. Read more

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు..ఓటర్లకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. జార్ఖండ్‌లో నేడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు Read more

Karanam Malleswari: ప్రధాని మోదీతో భేటీ అయిన కరణం మల్లీశ్వరి
Karanam Malleswari: ప్రధాని మోదీతో భేటీ అయిన కరణం మల్లీశ్వరి

ప్రధానమంత్రి మోదీతో కరణం మల్లీశ్వరి సమావేశం: భారత్‌ కీర్తిని నింపిన వెయిట్‌లిఫ్టర్‌ ఇటీవల హర్యానాలోని యమునానగర్‌లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, Read more

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెటా, ఆపిల్ పై CCI దర్యాప్తు
apps

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ప్రస్తుతం పెద్ద సాంకేతిక సంస్థలపై తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేస్తోంది. ఈ సంస్థలు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మెటా, మరియు ఆపిల్ Read more

×