Hydra team going to Bangalore today

నేడు బెంగళూరుకు వెళ్లనున్న హైడ్రా బృందం

హైదరాబాద్‌: హైడ్రా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది. ఈ మేరకు రెండు రోజుల పాటు హైడ్రా బెంగళూరులో పర్యటించనుంది. బెంగళూరులో చెరువుల పరిరక్షణ ఎలా ఉంది..అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. అనే దానిపై అన్వేషణ హైడ్రా చేయనుంది. ఈ నేపథ్యంలోనే నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది.

చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో హైడ్రా బృందం పరిశీలించనుంది. ఈ మేరకు బెంగళూరుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు..బయల్దేరనున్నారు. కాగా, హైడ్రా మళ్లీ రంగంలోకి దిగుతోంది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారికి నోటీసులు జారీ హైడ్రా చేస్తోంది. కబ్జాను బట్టి వారం నుంచి 15 రోజుల టైం ఇస్తామంటున్నది. ఇప్పటికే సుమారు 60 నోటీసులు జారీ చేసింది హైడ్రా. ఈ నెలాఖరికి కొన్ని అక్రమ నిర్మాణాలను హైడ్రా డిమాలిష్ చేయనుంది. పూర్తిగా కబ్జా అయిన కొన్ని చెరువులకు తిరిగి పునరుజ్జీవనం కల్పిస్తామంటున్న హైడ్రా…. చెరువుల్లోకి వచ్చే వ్యర్ధాలను ఆపడానికి పిసిబి తో కలిసి పని చేయనుంది. చెరువుల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చే వారం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తో MOU చేసుకోనుంది హైడ్రా.

Related Posts
నేడు తెలంగాణ కేబినెట్‌ భేటి..పలు కీలక అంశాలపై చర్చ..!
Telangana cabinet meeting today.discussion on many important issues

హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలు చర్చకు రాబోతోన్నాయి. Read more

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందన
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి Read more

ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్..త్వరలోనే గజ్వేల్లో భారీ సభ!
kcr

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంటికే పరిమితమైన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) మళ్లీ Read more

సోషల్ మీడియా విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక ప్రకటన
Social media ban for UK und

ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని ఓ కీలక చట్టం అమలు చేయబోతోంది. సోషల్ మీడియాలో 16ఏళ్ల లోపు పిల్లలను బ్యాన్ చేసే బిల్లుకు అక్కడి ప్రతినిధుల Read more