Telangana cabinet meeting today.discussion on many important issues

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటి..పలు కీలక అంశాలపై చర్చ..!

హైదరాబాద్: ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలు చర్చకు రాబోతోన్నాయి. ముఖ్యంగా, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు పెండింగ్ డీఏలతో పాటు, వారి సమస్యలపై కేంద్రీకృతంగా చర్చలు జరగనున్నాయనీ సమాచారం. సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసారు. జీవో నెం.317 కూడా చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉంది.

Advertisements

మూసీ వరద బాధితులకు పరిహారం గురించి కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పై అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీసీ కుల గణన, కొత్త ఆర్వోఆర్ చట్టంపై కూడా కేబినెట్ చర్చించనుందని తెలుస్తోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చ జరగనున్నట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు కట్టబెడుతున్న నేపథ్యంలో, పురపాలక చట్టంలో సవరణలు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు, కొత్త రేషన్ కార్డుల వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించబడే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడులు మరియు రైతుభరోసా పథకం గురించి కూడా కేబినెట్ చర్చించనుంది. ఈ నెలాఖరు లోపు రుణమాఫీ పొందని రైతులకు ఈ పథకం వర్తింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Related Posts
ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్‌కు సీఎం శంకుస్థాపన..
CM Revanth Reddy laid the foundation stone for the new building of Osmania Hospital

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియం వద్ద కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా హాస్పిటల్ భవనానికి శుక్రవారం Read more

Swimming: ఈత సరదా కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదం
ఈత సరదా కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదం

ఈత అంటే ప్రతి ఒక్కరికి ఆసక్తి, సరదా అయితే ఈత వచ్చిన వారు, నేర్చుకునే వారు ప్రమాదాలు, వ్యాధులకు అవకాశం లేకుండా తగు జాగ్రత్తలు పాటించడం చాలా Read more

సింగిల్ పేరెంట్ గా లైఫ్ ఎలా ఉంది..? సానియా చెప్పిన సమాధానం ఇదే..!
sania mirza son

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర్ షోయబ్ మాలిక్ గత ఏడాది జనవరిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల తర్వాత సానియా తన Read more

బిపిన్ రావ‌త్ మృతిపై లోక్‌స‌భ‌లో రిపోర్టు
Report on Bipin Rawat death in Lok Sabha

న్యూఢిల్లీ: త‌మిళ‌నాడులోని కూనూరులో త్రివిధ ద‌ళాధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణిస్తున్న‌ ఎంఐ 17 వీ5 హెలికాప్ట‌ర్ 2021 డిసెంబ‌ర్ 8వ తేదీన ప్ర‌మాదానికి గురైన విష‌యం Read more

×