CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి..క్యాబినెట్ విస్తరణ పై చర్చ జరుగనుందా..?

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అయి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర , ఝార్ఖండ్ ఎన్నికల్లో వ్యవహరించాల్సి వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుండటంతో సీఎం రేవంత్‌ రెడ్డి టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపుతారనే అంశంపై అటు పార్టీలోనూ.. ఇటు ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ పై చర్చ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కేటీఆర్‌ పలువురు కేంద్ర పెద్దలను కలిసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ కంప్లైట్ ఇచ్చారు కేటీఆర్‌. సీఎం రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా టెండర్లు కట్టబెట్టారని.. అమృత్ 2.O ప్రాజెక్ట్‌లో తెలంగాణకు కేటాయించిన 8వేల 888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని కోరారు కేటీఆర్‌. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మరి కేటీఆర్ ఫిర్యాదుపై కేంద్రమంత్రి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Related Posts
తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Krishna statue unveiled in

గుంటూరు జిల్లా తెనాలిలో దివంగత నటుడు, సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, నిర్మాత ఆదిశేషగిరిరావు పాల్గొని విగ్రహాన్ని Read more

సంక్రాంతి సందర్బంగా ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయంటే..?
How many vehicles went towa

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గడపాలని చాలామంది పుట్టిన ఊళ్లకు బయలుదేరుతున్నారు. Read more

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
TDP candidates who have fil

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బిజెపి Read more

పెళ్లి చీరతోనే గ్రూప్‌-2 మెయిన్స్ కు హాజరైన వధువు
Bride With Wedding Dress To

ఏపీలో వివాదాలు, నిరసనల నడుమ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతుండగా, 92,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికోసం Read more