Self employment scheme for unemployed youth.. Deputy CM

నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకం : డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకి ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించనున్నారు. సంక్షేమ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగ యువతకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సాయం చేయనున్నారు. మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2న అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్దిదారులకు పథకాలు అందుతాయి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అయితే ఈ పథకంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది అని ఆశిస్తున్నారు.

Advertisements
నిరుద్యోగ యువత కోసం స్వయం

ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

కాగా, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతులు నిరాకరించారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, మంత్రుల సమావేశం జరిగింది. ఆయా శాఖలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై ప్రతిపాదనలు సమర్పించారు. ఈనెల 19 లేదా 20న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈసారి మూడు లక్షల 20 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టె అవకాశం ఉంది. మార్చి 29 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం.

Related Posts
Miss World Festival : చేనేత చీరలో మెరవనున్న అందగత్తెలు
Beautiful ladies shining in handloom sarees

Miss World Festival : హైదరాబాద్ నగరంలో మే 15వతేదీన జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పోచంపల్లి చీరలు మెరవనున్నాయి. తెలంగాణ చేనేత వారసత్వం, సాంస్కృతిక గొప్పతనాన్ని Read more

సిరియాలో కొనసాగుతున్న మారణకాండ
సిరియాలో కొనసాగుతున్న మారణకాండ

సిరియాలో ప్రభుత్వ అనుకూల దళాలు తమ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాయి. దేశంలో ఐదు రోజులుగా సాగుతున్న అంతర్యుద్ధంలో వందల సంఖ్యలో సాయుధులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది Read more

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం
ap land registration

ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల Read more

సీఎం రేవంత్ తో మ్యూజిక్ డైరెక్టర్ దేవి భేటీ
cm revanth devi

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్..సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసంలో సమావేశమై ఈనెల 19న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే Read more

×