indian currencey

దారుణంగా పతనమైన రూపాయి విలువ

రోజురోజుకు రూపాయి మారకం విలువ పడిపోతూ వున్నది. నేడు దారుణంగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే తొలిసారి 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బీపీఎస్‌ను తగ్గించడం, 2025 నాటికి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది. బలహీన మూలధన ప్రవాహాలకు తోడు ఇతర ఆర్థిక సవాళ్ల కారణంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న కరెన్సీపై ఇది అదనపు భారాన్ని మోపింది.
మరింతగా దిగజారిన మారకం విలువ
డాలర్‌తో పోలిస్తే బుధవారం రూపాయి మారకం విలువ రూ. 84.9525కు పడిపోగా, గురువారం మరింత క్షీణించి రూ. 85.0650కు దిగజారింది. రెండు నెలల్లోనే రూపాయి మారకం విలువ రూ. 84 నుంచి 85కు పడిపోవడం గమనార్హం. అదే సమయంలో రూ. 83 నుంచి రూ. 84కు క్షీణించడానికి 14 నెలల సమయం పట్టింది. అంతకుముందు రూ. 82 నుంచి రూ. 83కు పతనం కావడానికి 10 నెలల సమయం పట్టగా, ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే రూ. 84 నుంచి రూ. 85కు పడిపోయింది.
ఇతర దేశాలో కూడా పతనం
అయితే, భారత కరెన్సీ ఒక్కటే కాదు, ఇతర దేశాల కరెన్సీ కూడా భారీగా క్షీణించింది. ఆసియా దేశాల కరెన్సీ కూడా గురువారం భారీగా పతనమైంది. కొరియన్ వొన్, మలేసియా రిగ్గిట్, ఇండోనేషియన్ రుపయా 0.8 శాతం నుంచి 1.2 శాతం క్షీణించింది.

Related Posts
ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ – కీలక అంశాలపై నివేదిక
ప్రధానితో రేవంత్ భేటీ - కీలక అంశాలపై నివేదిక

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపైన చర్చ జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు… పెండింగ్ అంశాల పైన సీఎం Read more

మహాకుంభ యాత్రికుల భద్రతను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

రాబోయే మహాకుంభ ఉత్సవాల్లో పాల్గొనే యాత్రికులకు భద్రతా చర్యలు, మార్గదర్శకాలను కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్, Read more

10.5 లక్షల వరకు పన్ను మినహాయింపు
10.5 లక్షల వరకు పన్ను మినహాయింపు

10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపును ప్రభుత్వం పరిగణించవచ్చు: నివేదిక ప్రభుత్వం, తక్కువ ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారులకు అంటే 10.5 లక్షల వరకు పన్ను Read more

గోదావరి పుష్కరాల ముహూర్తం- కేంద్రం కీలక నిర్ణయం
godavari pushkaralu

మహాకుంభ మేళా జరుగుతున్న వేళ గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ప్రారంభం అవుతున్నాయి. కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి Read more