arjun awards

తెలుగు తేజాలకు అర్జున పుర‌స్కారాలు

మన తెలుగు అమ్మాయిలకు రెండు అర్జున పుర‌స్కారాలు లభించాయి.
కేంద్రం ప్ర‌క‌టించిన జాతీయ క్రీడా పుర‌స్కారాల్లో తెలుగు తేజాలు ఇద్ద‌రు ఎంపిక‌య్యారు. అథ్లెటిక్స్ విభాగంలో య‌ర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిల‌కు అర్జున అవార్డులు ద‌క్కాయి. ఇక య‌ర్రాజి జ్యోతి ఏపీలోని విశాఖ‌ప‌ట్నం వాసి కాగా, జివాంజి దీప్తిది తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా.


32 మంది అర్జున పుర‌స్కారాలు
ఈ ఏడాది ఈ ఇద్ద‌రితో స‌హా మొత్తం 32 మంది అర్జున పుర‌స్కారాలకు ఎంపిక‌య్యారు. అటు ఖేల్ ర‌త్న‌కు మ‌ను బాక‌ర్‌, గుకేశ్‌, ప్ర‌వీణ్ కుమార్, హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్‌ల‌ను కేంద్రం ఎంపిక చేసింది. ఇక అర్జున అవార్డు (జీవితకాలం సాఫ‌ల్య పుర‌స్కారం) కోసం సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా-స్విమ్మింగ్) ఎంపిక‌య్యారు. అలాగే ద్రోణాచార్య అవార్డు కోసం కోచ్‌లు సుభాష్ రాణా (పారా-షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ)ను ఎంపిక చేయ‌డం జ‌రిగింది.ఇదిలాఉంటే.. జాతీయ క్రీడా అవార్డులు-2024 విజేతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ ఈరోజు (గురువారం) ప్ర‌క‌టించింది. ఈ నెల 17న‌ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు అవార్డులను అందుకోనున్నారు.

Related Posts
Nagababu :చంద్రబాబు, పవన్ పై నాగబాబు ఇంట్రెస్ట్ వ్యాఖ్యలు
Nagababu :చంద్రబాబు, పవన్ పై నాగబాబు ఇంట్రెస్ట్ వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు ఏపీ శాసనమండలిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎక్స్ Read more

సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
pawan tirumala laddu

AP Govt suspends SIT investigation అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై Read more

ఏపీ జలదోపిడీకి BRS సహకారం – మంత్రి ఉత్తమ్ ఆరోపణలు!
ఏపీ జలదోపిడీకి BRS సహకారం – మంత్రి ఉత్తమ్ ఆరోపణలు!

ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి BRS ప్రభుత్వం సహకరించింది – మంత్రి ఉత్తమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన Read more

ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్
kcr

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాల హామీ రాష్ట్రంలో Read more