dec 09 telugu talli

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం – సీఎం రేవంత్

కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గురువారం విజయోత్సవాలఫై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని , ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని అధికారులకు , నేతలకు తెలిపారు. అలాగే విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ సభల్లో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు.

నవంబర్ 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవాలు జరపాలని పేర్కొన్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల వారీగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఇక డిసెంబర్ 9న సెక్రెటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను శాఖలవారీగా ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం సూచించారు.

Related Posts
నేటి నుంచి ఒంటిపూట బడులు
school holiday 942 1739263981

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు ఒంటిపూట బడులను ప్రకటించాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు మధ్యాహ్నం తీవ్ర Read more

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలి- చంద్రబాబు
Polavaram diaphragm wall

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని అధికారులకు నిర్దేశనలిచ్చారు. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి, నీటి Read more

బోరుగడ్డకు రాచమర్యాదలు చేసిన పోలీసులు సస్పెండ్
anil

బోరుగడ్డ అనిల్ కేసులో మరో నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అనిల్ కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, Read more

పవన్ జయకేతనం సభకు భారీ ఏర్పాట్లు
పవన్ జయకేతనం సభ: భారీ ఏర్పాట్లు, కొత్త రోడ్ మ్యాప్ ఏంటో?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన నేపథ్యంలో, పార్టీల మధ్య అంతర్గత వ్యూహాలు మారుతున్నాయి. అధికారంలో ఉన్న Read more