ttd temple

తెలంగాణ ఎమ్మెల్యేకు టీటీడీ గుడ్ న్యూస్

తెలంగాణలో ప్రజా ప్రతినిధులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఇకపై తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తెలంగాణ సిఫార్సు లేఖలకు చిక్కులు తొలగినట్లే. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ నుంచి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పంపే సిఫార్సు లేఖల ఆధారంగా తిరుమలలో శ్రీవారి దర్శనం కేటాయింపుల్లో ఈ మధ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తెలంగాణకు చెందిన అధికార, విపక్ష పార్టీలు కూడా దీనిపై అసంతృప్తిగా ఉన్నాయి. తొలుత ఈ విషయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విమర్శలపై టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా స్పందించారు. తిరుమలలో వివక్ష పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు.
తిరుమల దర్శనానికి వచ్చే తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు రావడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

 ttd temple


వారానికి 4 సిఫార్సు లేఖలకు అంగీకారం
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు. ఈ భేటీలో వీరు ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పారు. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఎమ్మెల్సీలకు వారానికి 4 సిఫార్సు లేఖలను అంగీకరించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారు. ఇందులో వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు మరో రెండు మూడు వందల రూపాయల దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.

Related Posts
పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
pawan ycp

చంద్రబాబు కాల్ కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు Read more

డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !
New law in AP soon: CM Chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది Read more

తండ్రి తిన్న ప్లేట్ ను తీసి శభాష్ అనిపించుకున్న నారా లోకేష్
naralokeshWell done

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు Read more

కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ మిర్చి రైతులు మద్దతు ధర ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా ఇబ్బందులు Read more