Revanth reddy

తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్స్ వరకు అనుమతి ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తక్కిసలాట జరగడం, ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఇప్పటికీ కోమలోనే మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తుతో చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
“నేను సినీ ప్రముఖులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. అమానవీయ ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. సినిమాలు తీసుకోండి, వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి షూటింగ్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి. ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేను కుర్చీలో ఉన్నంత వరకూ ఇలాంటి ఘటనలను ఉపేక్షించను. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడటమే నా బాధ్యత, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదు” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Related Posts
సోనూసూద్ మంచి మనసు.. చిన్నారికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్
sonuhelps

సినీ నటుడు సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఖమ్మం (D) చెన్నూరుకి చెందిన నిరుపేదలు కృష్ణ, బిందుప్రియల మూడేళ్ల కూతురికి ఉచితంగా ముంబైలో హార్ట్ ఆపరేషన్ Read more

ఏపీలో మధ్యాహ్న భోజనం మెనూ మార్పుపై కసరత్తు
Mid day meal menu change ex

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం (Mid-Day Meal Scheme) కింద ఉన్న వంటకాలను సమీక్షించి, మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని ముఖ్యమైన Read more

మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా : మమతా బెనర్జీ
Religious Event Maha Kumbh Mela .. Mamata Banerjee

యూపీ సర్కారు వీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు చేసిందని ఆగ్రహం కోల్‌కతా : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో Read more

ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధమే : జెలెన్‌స్కీ
పుతిన్ మోసపూరిత చర్యలపై జెలెన్‌స్కీ ఆగ్రహం

కీవ్ : ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ ఇటీవల మీడియా ఎదుటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ట్రంప్‌ తో భేటీ Read more