srinivas

తెలంగాణపై వివక్ష వద్దు: శ్రీనివాస్ గౌడ్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదాస్వాద వ్యాఖ్యలు చేసారు. దేవుడి ముందు అందరూ సమానమేనని… వివక్ష చూపడం సరికాదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈరోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఇది మంది పద్ధతి కాదని చెప్పారు.
సౌకర్యాలను కొనసాగించండి
తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. టీటీడీ ఛైర్మన్ కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వాళ్లేనని అన్నారు. వ్యాపారాల్లో, పదవుల్లో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ప్రపంచంలోనే పేరుపొందిన ఆలయం అని ఇంత పవిత్రత కలిగిన ఆలయంలో వివక్ష చూపడం సరికాదని ఆయన అన్నారు.

Related Posts
నేడు దావోస్ పర్యటనకు చంద్రబాబు
chandrababu davos

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర అధికారుల బృందం కూడా Read more

ఖరీదైన విదేశీ గంజాయి పట్టివేత
ganjai

తెలంగాణ ప్రభుత్వం మత్తుపదార్థాలు లేని రాష్ట్రంగా చేసేందుకు యెంత కృషి చేస్తున్నా, ఆశించిన ఫలితం పొందడం లేదు. తాజాగా విదేశాల నుంచి ఖరీదైన గంజాయిని తెప్పించి.. హైదరాబాద్‌లో Read more

కుల గణన సర్వే నివేదికను ప్రవేశపెట్టిన సీఎం..
CM Revanth Reddy introduced the caste enumeration survey report

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణన సర్వే 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్వే ప్రకారం Read more

తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
Assembly sessions to resume

హైదరాబాద్‌: ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని Read more