cyclone 1

తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు ఆకస్మిక వరదలు

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఫెంగాల్ తుఫాను వణికిస్తోంది. ముఖ్యంగా తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను కారణంగా సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

నాగపట్నానికి 230 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 210 కిలో మీటర్లు, చెన్నైకి 210 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 7కిలోమీటర్ల వేగంతో ఫెంగాల్ తుపాను కదులుతుంది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నంకు పుదుచ్చేరిలోని కార్తెకాల్, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమతతంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి,నెల్లూరు,ప్రకాశం తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి (నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

Related Posts
పాకిస్తాన్‌లో పోలియో వ్యాప్తి: 2024లో 55 కేసులు, సవాలుగా మారిన పరిస్థితి..
pakistan polio cases

పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ మరియు ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్సుల్లో మూడు కొత్త పొలియో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో 2024 సంవత్సరంలో ఇప్పటివరకు పొలియో బాధితుల సంఖ్య Read more

నాగ చైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్..?
chaitu weding date

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వివాహం డిసెంబర్ 4న జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడవచ్చని సమాచారం. Read more

నటుడు సోనూ సూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం
Sankalp Kiron award to actor Sonu Sood

హైదరాబాద్‌: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం నాంపల్లిలోని లలిత కళా తోరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో Read more

ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి
President to Mangalagiri AI

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో Read more