ttd temple

తిరుమల మృతులకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

టీటీడీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. కాగా తిరుపతి తొక్కిసలాటలో మృతిచెందిన వారికి ఏపీ ప్రభుత్వం భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. కాగా.. తిరుపతి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను రుయా ఆస్పత్రి వద్ద రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనాయణ రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే బాధ్యతారాహిత్యంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు.

మరోవైపు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అవడంతో.. వారి వారి స్వగ్రామాలకు ప్రత్యేక అంబులెన్స్‌లో పోలీసులు తరలిస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశికి ముందు ఇలాంటి ఘటన దురదృష్టకరమని మంత్రులు అన్నారు. అలాగే తొక్కిసలాటపై తిరుపతి పోలీసులకు తహసీల్దార్‌ ఫిర్యాదు చేశారు. బైరాగిపట్టడి రామానాయుడు స్కూల్‌ దగ్గర జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ కోరారు. అలాగే మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకోనున్నారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించనున్నారు.

Related Posts
ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది
ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది

ఉన్నతాధికారుల తొలగింపు - ఫైబర్‌నెట్‌లో మార్పులు ఏపీ ఫైబర్‌నెట్‌లో ముగ్గురు ఉన్నతాధికారుల పై వేటు పడింది. ఫైబర్‌నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌ భరద్వాజ, ఫైబర్‌నెట్ బిజినెస్ హెడ్ Read more

ఆశా వర్కర్లకు గుడ్​న్యూస్​..వయోపరిమితి పెంపు..
Good news for Asha workers..increase in age limit

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశా వర్కర్లపై వరాల జల్లు కురిపించారు. ఆశా కార్యకర్తల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. వారికి మొదటి 2 Read more

విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ప్రాజెక్ట్‌ కి అనుమతి?
విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్?

ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైలు ప్రాజెక్టులకు కొత్త ఊపిరి లభిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు
Soon we will bring internet to every house.. Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకుకు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర Read more