tirumala eo

తిరుమల కాటేజీల పేర్లు మార్పు

టీటీడీ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టనున్నామని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు. కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతిలోని పరిపాలన భవనం మీటింగ్‌ హాల్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలను మోడల్‌ టౌన్‌గా మార్చడమే తమ లక్ష్యమని , ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని చెప్పుకొచ్చారు.

Advertisements

అలాగే ఆలయంలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతోపాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్‌ను కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్ల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంటును రూపొందించి మౌళిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన ఉందన్నారు.

Related Posts
ప్రియాంకపై పోటీ.. ఎవరీ నవ్యా హరిదాస్?
navya haridas details

నవ్యా హరిదాస్ బీజేపీకి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, ప్రస్తుతం వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీకి (కాంగ్రెస్) వ్యతిరేకంగా పోటీ చేయనున్నారు. ఆమె బీటెక్ Read more

టాటా మోటార్స్ యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాల 10వ వార్షిక నివేదిక విడుదల
Release of 10th Annual Report of Tata Motors CSR activities

ముంబయి: భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్, తమ వ్యూహాత్మక కమ్యూనిటీ జోక్యాల యొక్క పరివర్తన ప్రభావాన్ని వేడుక చేసుకుంటూ ఈరోజు తమ 10వ Read more

ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడి
ukraine russia

శుక్రవారం తెల్లవారుజామున రష్యా క్షిపణి దాడి కీవ్ నగరాన్ని దెబ్బతీసింది. ఈ దాడికి ప్రతిస్పందించిన వాయు రక్షణ వ్యవస్థ వలన కొంతవరకు క్షిపణి దాడిని అడ్డగించేందుకు ప్రయత్నం Read more

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు భార‌త బౌలర్ల షాక్‌!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు భార‌త బౌలర్ల షాక్‌!

బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు భార‌త బౌలర్ల షాక్‌! దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. టాస్‌ గెలిచి Read more

×