sabarimala

తిరుపతి ఘటనతో శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం!

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది చనిపోవడం దేశంలోని సంచల వార్తగా మారింది. దీనితో మకరజ్యోతి దర్శనం వేళ భక్తుల సంఖ్య అనూహ్యంగా ఉండటంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి ఘటన తరువాత ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ టికెట్ల సంఖ్యను తగ్గించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలు నిర్ణయాలు అమలు చేస్తున్నారు. టికెట్ల జారీ పైన ప్రకటన చేసారు. తాజాగా శబరిమల యాత్రీకులకు భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

Advertisements


శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మకరజ్యోతి దర్శనం కోసం లక్షలాది భక్తులు శబరిమల చేరుకున్నారు. తాజాగా తిరుపతి ఘటన నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తుల రద్దీ పెరిగినా.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆన్‌లైన్ టికెట్ల సంఖ్యను తగ్గించిన అధికారులు ఈ రోజు, రేపు ఇచ్చే టికెట్ల గురించి స్పష్టత ఇచ్చారు.
తాజాగా, శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రీకులు అందరికీ ట్రావెన్​కోర్ దేవ స్వం బోర్డ్ (టీడీబీ) రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పింస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం 13,600 మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించారు.2,500 మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ని విధుల్లో కేటాయించారు. అదే విధంగా యాత్రీకల కోసం పంబ, అప్పాచిమేడు, సన్నిధానం సహా సమీపంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. యాత్రీకుల కోసం ఎస్ఎంఎస్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రేపు (మంగళవారం) సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు..మకరజ్యోతి దర్శనం కలగనుంది. తిరుపతి ఘటన..గత విషాదాలతో ఈ సారి దేవస్థాన అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఏ చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా అన్ని విభాగాలను అప్రమత్తం చేసారు.

Related Posts
Student Arrest: అమెరికాలో స్టూడెంట్ అరెస్టు: చర్చనీయాంశంగా మారిన ఘటన
అమెరికాలో స్టూడెంట్ అరెస్టు: చర్చనీయాంశంగా మారిన ఘటన

విద్యార్థులపై ఇమిగ్రేషన్ కఠిన చర్యలుఅమెరికాలో అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లని వారిపై ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మసాచుసెట్స్‌లో Read more

Donald Trump: ట్రంప్ సుంకాల దెబ్బ: భారత్‌కు ఎంత నష్టం?
ట్రంప్ సుంకాల దెబ్బ: భారత్‌కు ఎంత నష్టం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాలు విధించబోతున్నారు. సుంకాలు విధించబడే దేశాల లిస్టులో ఇండియా పేరు కూడా ఉంది, దింతో భారతదేశంలో Read more

ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేసిన అధికారులు
Officials who besieged the Delhi Secretariat

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల ఫలితాలు రాగానే కీలక ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ నుంచి ఒక్క ఫైల్ కూడాబయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈ మేరకు Read more

దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా?
how many companies india

ఇప్పటి వరకు 5,216 విదేశీ కంపెనీలు 2025 జనవరి 31 నాటికి 28 లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ దేశంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న Read more

×