suprem court

తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు హెచ్చరిక

న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది. తమిళనాడులోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామకంపై సీఎం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్నది. గవర్నర్‌ వీసీగా వ్యహరించే అధికారాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీనితో పాటు పలు నియామకాల్లో గవర్నర్‌ అధికారాలను పరిమితం చేసింది. అయితే ఈ బిల్లులను ఆమోదించడానికి ఆర్‌ఎన్‌ రవి నిరాకరించారు.

Advertisements

కాగా, మద్రాస్ విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయం, తమిళనాడు ఉపాధ్యాయ శిక్షణ విశ్వవిద్యాలయాలకు వైస్-ఛాన్సలర్లను నియమించడానికి గవర్నర్‌ రవి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్య చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి సభ్యులను తొలగించడంతోపాటు ఆ కమిటీని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్బీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరువురు కలిసి బిల్లుల పెండింగ్‌ వివాదాన్ని పరిష్కరించుకోవడం మంచిదని సూచించింది. లేనిపక్షంతో ఈ సమస్యను తాము పరిష్కరిస్తామని కోర్టు హెచ్చరించింది.

Related Posts
Ayodhya: శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం
శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యలో అదిరిపోయే ఘట్టం

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ఇప్పుడు భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినం ఎంతో వైభవంగా జరుగుతుంది కానీ ఈ సారి అది మరింత ప్రత్యేకంగా మారింది. Read more

ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐదు వేల కోట్ల బెట్టింగ్
ఛాంపియన్స్ ట్రోఫీ పై ఐదు వేల కోట్ల బెట్టింగ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా భారత్ ,న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో జరగనుంది. ఈ క్రికెట్ మెగా ఈవెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా Read more

ఇస్రో ‘యువ విజ్ఞాని’కి దరఖాస్తుల స్వీకరణ
ISRO accepting applications for 'Young Scientist'

న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. శ్రీహరికోటతో పాటు… డెహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌), తిరువనంతపురం (కేరళ), Read more

Amit Shah: హిందీ ఏ భాషకూ పోటీ కాదు : అమిత్ షా
Amit Shah హిందీ ఏ భాషకూ పోటీ కాదు అమిత్ షా

Amit Shah: హిందీ ఏ భాషకూ పోటీ కాదు : అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భాషల మధ్య విభేదాలకు తావులేదని స్పష్టం చేశారు. Read more

×