telangana assembly sessions

డిసెంబ‌ర్ 9 నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9నుంచి మొదలుకాబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుండటంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పధకాలు గురించి సభలో చర్చించే అవకాశం ఉంది. రైతురుణమాఫీ, కులగణనపై చర్చించే అవకాశం ఉంది. డిసెంబ‌ర్ 7వ తేదీతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్తవుతుంది. దీంతో ఆ లోపే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

మ‌రోవైపు రాష్ట్రంలో పంచాయితీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కుల‌గ‌ణ‌న త‌ర‌వాత పంచాయితీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్లు స‌వ‌రించి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో పంచాయితీ ఎన్నిల‌క‌పై కూడా అసెంబ్లీలో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆస‌రా పెన్ష‌న్, మ‌రికొన్ని హామీలు అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆస‌రా పెన్షన్ ఇస్తున్న‌ప్ప‌టికీ గ‌త ప్ర‌భుత్వంలో ఇచ్చిన విధానాన్నే కొన‌సాగిస్తున్నారు. కాగా ఇప్పుడు పెన్షన్ కూడా పెంచి ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై చర్చించి ఆమోదించనున్నారు. దీని ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది.

Related Posts
మంత్రి లోకేష్ కు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు
chiru lokesh

మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా రాజకీయ నేతలే కాదు ఇతర రంగాల వారు సైతం పెద్ద ఎత్తున లోకేష్ కు పుట్టిన Read more

విజయసాయి రెడ్డి రాజీనామాకు కారణమేంటి?
Vijayasai Reddy quits polit

వైసీపీ పార్టీకి కీలక నేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ సందర్భంగా అనేక Read more

ఫార్ములా-ఇ రేస్ పై దానం నాగేందర్
ఫార్ములా ఇ రేస్ పై దానం నాగేందర్

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడంలో ఫార్ములా ఈ-రేస్ కీలక పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఫార్ములా Read more

డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్‌!: ప్రభాస్ సందేశం
prabhas

సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను విడుదల చేశారు. "మన కోసం బ్రతికేవాళ్లు ఉన్నారు… ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్" అంటూ Read more