ponguleti runamafi

డిసెంబర్ లోపు మిగిలిన వారికి రుణమాఫీ చేస్తాం – మంత్రి పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఇల్లెందు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ.. డిసెంబర్ నెలలోపు మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు అనేక ఉచిత హామీలు ఇవ్వడం తో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను భారీ మెజార్టీ తో గెలిపించారు.

ఇక అధికారంలోకి రాగానే చెప్పినట్లే హామీలు నెరవేర్చడం మొదలుపెట్టింది. పలు కీలక హామీలు నెరవేర్చిన సర్కార్..మిగిలిన హామీలను కూడా త్వరలోనే నెరవేర్చాలని చూస్తుంది. అయితే రైతు రుణమాఫీ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో హామీ నెరవేర్చలేకపోయింది. పలు కారణాల కారణంగా కొంతమందికి మాత్రం రుణ మాఫీ చేయగా..మరికొంతమందికి మాఫీ చేయలేకపోయింది. దీంతో మాఫీ కానీ రైతులు సర్కార్ పై ఆందోళనకు దిగారు. త్వరగా మాకు కూడా రుణమాఫీ చేయాలనీ కోరుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి డిసెంబర్ లోపు మిగిలినవారికి కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

Related Posts
ట్రంప్ ఎఫెక్ట్..చెదిరిపోతున్న భారత విద్యార్థుల కల?
donald trump

అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే Read more

మీడియాపై జరిగిన దాడికి మంచు మనోజ్ క్షమాపణలు
Manchu Manoj Clarification on His Emotional Speech.jpg

మీడియా ముందు భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న మనోజ్ హైదరాబాద్:సినీ నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. మంగళవారం జరిగిన ఘటనకు Read more

నవంబర్‌ 6న ఏపీ కేబినెట్ భేటీ
ap cabinet meeting

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ నవంబర్ 6న ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై Read more

జనవరి 9న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ..
tirumala 1

తిరుమల: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జనవరి 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ Read more