HDFC Bank BLOOD DONATION

డిసెంబరు 6న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 16వ వార్షిక రక్తదాన శిబిరాలు

డిసెంబరు 2024: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తన ఫ్లాగ్‌షిప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్‌లో భాగంగా తన దేశవ్యాప్త రక్తదాన శిబిరాల నిర్వహణ 16వ ఎడిషన్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. డిసెంబరు 6, 2024న ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ డ్రైవ్ భారతదేశంలోని 1100+ నగరాల్లో నిర్వహిస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత ఏడాది కన్నా ఈ ఏడాది చాలా ఎక్కువ భాగస్వామ్యాన్ని అంచనా వేసుకుని, 6 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రక్తదాన శిబిరంలో పాల్గొనేవారిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులు, వినియోగదారులు, కార్పొరేట్‌లు, రక్షణ దళాల సభ్యులు, విద్యార్థులు మరియు సాధారణ పౌరులు ఉంటారు. ఈ ప్రయత్నం సమాజ సంక్షేమానికి బ్యాంక్ నిబద్ధతను నొక్కి చెబుతూ, భారతదేశం రక్త సరఫరా కొరత, సవాళ్లను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

‘‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో, సముదాయ- ఆధారిత కార్యక్రమాల పరివర్తన శక్తిని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. మా 16వ అఖిల భారత బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ద్వారా, సమాజానికి అర్ధవంతమైన సహకారాన్ని అందించేందుకు పౌరులకు ఒక వేదికను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. దానం చేసిన ప్రతి రక్తపు బొట్టు ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మేము ఇవ్వడం మరియు బాధ్యత వహించే సంస్కృతిని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నాము’’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భారుచా అన్నారు.

‘‘రక్తదానం అనేది కేవలం ఔదార్యానికి సంబంధించిన చర్య కాదు… అవసరంలో ఉన్నవారికి ఇది జీవనాధారం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో, మా ఉద్యోగులు ప్రతి ఏడాది కలిసి వార్షిక రక్తదాన డ్రైవ్‌ను నిర్వహిస్తారు. ఇది గత 16 సంవత్సరాలలో గణనీయంగా విస్తరించింది. వారు అందించే ప్రతి రక్తపు బొట్టు మరింత పటిష్టమైన, ఆరోగ్యవంతమైన సంఘాన్ని నిర్మించాలనే మా నిబద్ధతను, అంకితభావాన్ని తెలియజేస్తుంది మరియు దీనితో మనం ప్రాణాలను కాపాడుకునేందుకు అవకాశం మరింత మెరుగవుతుంది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భవేష్ జవేరి తెలిపారు.

ప్రతి ఏడాది, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రముఖ బ్లడ్ బ్యాంక్‌లు, హెల్త్‌కేర్ సంస్థలతో భాగస్వాములై డ్రైవ్ విజయవంతమవుతూ వస్తోంది. ఈ ఏడాది, ఈ ప్రయత్నం దేశమంతటా విస్తృతమైన ప్రభావాన్ని నిర్ధారిస్తూ, ప్రభుత్వ అధికారులు మరియు వివిధ ఎన్‌జీఓలతో కలిసి పనిచేయడంతో పాటు, ప్రఖ్యాత రక్త బ్యాంకులతో మరోసారి సహకరిస్తుంది.

ఈ రక్తదాన శిబిరాలలో 18 మరియు 60 సంవత్సరాల మధ్య మంచి ఆరోగ్యంతో ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు రక్తదానం చేసేందుకు నేరుగా ఏదైనా శిబిరంలోకి వెళ్లవచ్చు. లొకేషన్‌ల పూర్తి జాబితా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.
ఈ రక్తదాన సేవలు 2007లో ప్రారంభమైనప్పుడు, కేవలం 88 కేంద్రాలు మరియు 4,385 యూనిట్లతో ప్రారంభం కాగా, 2023లో 7,487 శిబిరాలకు మరియు దాదాపు 6 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించింది. గత ఏడాది 1,900 కన్నా ఎక్కువ కళాశాలలు, 700 కార్పొరేట్ సంస్థలు, 100 రక్షణ మరియు సేవా సిబ్బంది సమూహాలు పాల్గొన్నాయి.

ఈ నిష్పత్తి పెరుగుదల పలు సంవత్సరాలుగా భారతదేశం అంతటా చక్కని ప్రభావాన్ని, విస్తృత భాగస్వామ్యాన్ని నొక్కి చెబుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ వార్షిక రక్తదాన డ్రైవ్ 2013లో ‘అతిపెద్ద (ఒకేరోజు, బహుళ వేదిక) రక్తదాన డ్రైవ్‌ను నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.

రక్తదానం చేయడానికి అర్హత ప్రమాణాలు
• దాత వయస్సు 18 నుంచి 60 ఏళ్లు ఉండాలి.
• దాత చివరి రక్తదానం 3 నెలల కన్నా ముందు చేసి ఉండాలి.
• దాత గత 7 రోజులలో దగ్గు, జలుబు లేదా జ్వరం వంటి ఎలాంటి అనారోగ్యానికి గురై ఉండకూడదు.
• దాత రక్తదానం చేసేందుకు కనీసం 3 గంటల ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి మరియు ఖాళీ కడుపుతో రక్తదానం చేయకూడదు.
• దాత రక్తదానం చేసేందుకు ముందుగా 2 గ్లాసుల నీరు త్రాగాలి.
• రక్తదానం చేయడానికి 4 నుంచి 6 గంటల ముందు దాత ధూమపానం చేయకూడదు లేదా పొగాకు నమలకూడదు.
• రక్తదానం చేయడానికి 24 గంటల ముందు దాత మద్యం సేవించకూడదు.
• దాత రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇవ్వాలి.
• దాత బరువు, హిమోగ్లోబిన్ స్థాయి, మెడికల్ ఫిట్‌నెస్ మరియు రక్తపోటును తనిఖీ చేసిన తర్వాత డాక్టర్ ఆమోదానికి లోబడి రక్తదానం చేయవచ్చు.

ఎలా పాల్గొనాలి
నమోదు చేయడానికి లేదా విరాళం ఇవ్వడానికి, పాల్గొనేవారు డిసెంబరు 6, 2024న పాల్గొనే రక్తదాన శిబిరాల్లో దేనినైనా సందర్శించవచ్చు. దాతలందరి భద్రత, ఆరోగ్యానికి భరోసానిస్తూ ఒక సాధారణ నమోదు ప్రక్రియ అనుసరించబడుతుంది. క్యాంపు స్థానాలు, రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాల కోసం, దయచేసి- https://leads.hdfcbank.com/applications/webforms/apply/Blood_Donation_Campaign/index.aspx మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సోషల్ మీడియా ఛానెల్‌లను సందర్శించండి.

Related Posts
సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకలు..
Sadhana Infinity International School Annual Day Celebrations

పనాచే-ట్విస్టెడ్ టేల్స్, ఆధునిక అభ్యాసంలో పాత కథల యొక్క కాలానుగుణ సంబంధంపై దృష్టి సారిస్తుంది. నల్లగండ్ల: సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్, నల్లగండ్ల తన ఎంతో ఆసక్తిగా Read more

ముంబై దాడులు: రాణా అప్పగింతకు US సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
mumbai attack

2008 ముంబై దాడుల కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాణా అప్పగింతపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను Read more

రూ. 24 కోట్ల నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025లో తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. Read more

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3కు షాక్‌..!
Britains King Charles 3 was shocked in the Australian Parliament

కాన్బెర్రా: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3కు షాక్‌ ఎదురైంది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడటం Read more