Deputy Speaker paid tribute Dr. BR Ambedkar

డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన ఉప సభాపతి

అమరావతి : భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈంసదర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటకి అధ్యక్షునిగా అంబేద్కర్ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగాన్ని రచించుటలో కీలక పాత్ర పోషించారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.

Advertisements

ఆనాడు సమాజంలోని పలు కులాల వెనుకబాటు తనాన్ని గుర్తించి త్వరితగతిన ఆయా కులాల వెనుకాటు తనాన్నిరూపు మాపేందుకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా రిజర్వేషన్లను పొందుపర్చారని అన్నారు.మన దేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘణత అంబేద్కర్ కే దక్కుతుందని ఉప సభాపతి పేర్కొన్నారు.నేడు దేశమంతా అంబేద్కర్ సేవలను కొనియాడుతోందని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.అంబేద్కర్ సేవలకు గుర్తుగా మన రాష్ట్రంలో ఒక జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడం జరిగిందని ఉప సభాపతి రఘరామ కృష్ణ రాజు తెలిపారు.

ఈకార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్న కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఇంకా పలువురు అసెంబ్లీ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్ని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

Related Posts
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇవాళ ఉదయం 9 Read more

శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
Srisailam Sankranti Brahmot

శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయని Read more

Central Govt : ఉపాధి హామీ పనులపై కేంద్రం కోతలు
Central Govt : ఉపాధి హామీ పనులపై కేంద్రం కోతలు

ఉపాధి హామీ పనులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం: రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త భారం హైదరాబాద్, గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)పై కేంద్ర ప్రభుత్వం మరోసారి కుంచించగొట్టే Read more

Train Accident : ఒడిశాలో రైలు ప్రమాదం.. ఒకరి మృతి?
Odisha Train Accident

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి అస్సాంలోని కామాఖ్య వెళ్తున్న కామాఖ్య ఎక్స్ప్రెస్ కటక్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు Read more

Advertisements
×