Donald Trump front Tower New York City August 2008

ట్రంప్ మరో నిర్ణయం

త్వరలో అమెరిగా అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యంగా మారిన డే లైట్ సేవింగ్ టైమ్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. డే లైట్ సేవింగ్ టైమ్ వల్ల అమెరికన్లపై చాలా భారం పడుతోందని ఆరోపించారు. రిపబ్లికన్ ప్రభుత్వం ఇలాంటి వాటిని సరిచేసి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ నిర్ణయం అమలు చేయడానికి ప్రయత్నిస్తానని వివరించారు. దీంతో ఏటా రెండుసార్లు టైమ్ ను సరిచేసుకునే ఇబ్బంది నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని, దేశంపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ట్రంప్ వివరించారు.
ఈ మార్పుతో ప్రజలకు సౌకర్యం
అమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణం చాలా ఎక్కువనే విషయం తెలిసిందే. యూఎస్ఏలోని కొన్ని ప్రాంతాలు వివిధ టైమ్ జోన్ లలో ఉన్నాయి. ఈ క్రమంలోనే పగటిపూట సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ‘డే లైట్ సేవింగ్ టైమ్’(డీఎస్ టీ). దీని ప్రకారం.. మార్చిలో పగటి పూట వెలుతురు ఎక్కువగా ఉన్నపుడు గడియారాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. తిరిగి నవంబర్ లో ఒక గంట వెనక్కి జరుపుతారు. దీని ఉద్దేశం పగటి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే. ఏటా మార్చి రెండవ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని గంట ముందుకు తిప్పి 3 గంటలు చూపించేలా మార్చుతారు. తిరిగి నవంబర్ మొదటి ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గడియారాన్ని 1 గంట చూపించేలా మార్చేస్తారు. ఈ విధానం ప్రజలకు అసౌకర్యంగా వుండడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisements
Related Posts
బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు – ఏపీ ప్రభుత్వం
Free Sewing Machine

ప్రతి నియోజకవర్గంలో 50 శాతం రాయితీతో జనరిక్ ఔషధ దుకాణాలు గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి గురుమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మహిళల అభివృద్ధికి మరొక Read more

మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్, టీడీపీ పార్టీలే – కేటీఆర్
ktr power point presentatio

మూసీని కంపు చేసింది టీడీపీ, కాంగ్రెస్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్​లో మూసీ నదిపై బీఆర్​ఎస్వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ Read more

సోనియాను కలిసిన సీఎం రేవంత్
revanth sonia

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ Read more

John Cena: చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన జాన్ సీనా
John Cena: చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన జాన్ సీనా

డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యంత విజయవంతమైన రెజ్లర్లలో ఒకరైన జాన్ సీనా, తాను పొందిన 17వ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌తో కొత్త రికార్డు Read more

Advertisements
×