టీం ఇండియాలో ఏదో సమస్య జరుగుతోందనే స్పష్టంగా కనిపిస్తోంది.ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత ఇది మరింత స్పష్టమైంది. జట్టులో ఆటతీరు తగ్గిందా?లేక జట్టులో అంతర్గత గొడవలే కారణమా? బీసీసీఐ ఇప్పటికే ఈ విషయంపై రివ్యూ చేపట్టింది. మార్పులు అవసరమని,అవసరమైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరికలు వెలువడుతున్నాయి.ఆసీస్ టూర్‌లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీం ఇండియా,గతంలో కివిస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఇదే దుస్థితి ఎదుర్కొంది.
రికార్డుల పరంగా బలమైన జట్టుకి ఇలాంటి తక్కువ ప్రదర్శన ఎందుకు?కోచ్ మరియు ఆటగాళ్ల మధ్య సంబంధాలు బాగోలేవా?రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ల వైఖరేనా? గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ స్పిరిట్ తగ్గిందా? ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యులను అనుమతించకపోవడాన్ని అంగీకరించరా?సీనియర్ ఆటగాళ్లు కొత్త ఆటగాళ్లతో కలిసి కలిసిపోవడం లేదన్న వాదనలు ఉన్నాయ. సెలక్టర్లతో గొడవలు,గంభీర్ విధానం వల్ల ఏర్పడిన మనస్పర్ధలు టీమ్‌లో బలహీనతకు దారితీశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితులపై బీసీసీఐ సీరియస్ అయింది.ఆటతీరు మెరుగుపరచకపోతే, టీమ్‌లో మార్పులు తప్పవన్న సంకేతాలు ఇస్తోంది.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గంభీర్‌కు వ్యతిరేకంగా ఉన్నారా?గంభీర్ ఆశించిన విధంగా జట్టును ముందుకు నడిపించలేకపోయాడా?బీసీసీఐ ఇప్పటికే మార్పులకు సిద్ధమవుతోందని ప్రచారం సాగుతోంది.ఛాంపియన్స్ ట్రోఫీ వరకు సమయం ఇస్తారా? లేక తక్షణమే మార్పులు చేస్తారా? ప్రస్తుతం ఇదే చర్చకు కేంద్ర బిందువైంది.ఈ పరిస్థితిలో టీం ఇండియా ఏ మార్గం ఎంచుకుంటుందో వేచి చూడాలి.