టాలీవుడ్‌లో మళ్లీ సత్తా చాటడానికి సిద్ధమైన రైమా సేన్ టాలీవుడ్‌లో పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తమదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో ముంబైకి చెందిన ఓ అందాల తార కూడా ఉంది.హిందీ, బెంగాళీ చిత్రాల్లో క్రేజీ హీరోయిన్‌గా ఎదిగిన ఈ నటి ఇరవై ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.ఈ కథనం నటి రైమా సేన్ గురించి.ఆమెను పేరు విన్నా చాలామందికి ఇట్టే గుర్తురాదు, కానీ నితిన్ నటించిన ధైర్యం సినిమా చెబితే కచ్చితంగా గుర్తుకు వస్తుంది.తేజ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో రైమా తన అందం, అభినయంతో యువతను మైమరిపించింది.అయితే, ఆ సినిమా తర్వాత ఆమె ఏ తెలుగు చిత్రంలోనూ కనిపించలేదు.ప్రస్తుతం రైమా సేన్ మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మా కాళీ’ సినిమాలో ఆమె ముఖ్య పాత్రలో కనిపించనుంది.ఈ సినిమా హిందీలో తెరకెక్కింది,కానీ తెలుగు, బెంగాళీ భాషల్లో కూడా విడుదల కానుంది.విజయ్ యెలకంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అభిషేక్ సింగ్ ప్రధాన పాత్ర పోషించారు. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పలు అవార్డులు సాధించడం విశేషం.2022లో గోవాలో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు.ఆ ప్రీమియర్ షోకు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్, గోవా డీజీపీ అలోక్ కుమార్ హాజరయ్యారు.ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా జైపూర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ‘మా కాళీ’ బెస్ట్ పొలిటికల్ మూవీ అవార్డును గెలుచుకుంది.రైమా సేన్ తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం మరో విశేషం.

ఈ చిత్రం 1946 ఆగస్టు 16న కలకత్తాలో జరిగిన ఒక విపరీత ఘటన ఆధారంగా రూపొందింది.ధైర్యం తర్వాత తెలుగులో నేరుగా నటించని రైమా, కొన్ని డబ్బింగ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.ఆమె ఇటీవల ‘ది వ్యాక్సిన్ వార్’, ‘ది బస్తర్ – నక్సల్ స్టోరీ’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇప్పుడు మళ్లీ ‘మా కాళీ’తో తెలుగులో తన ముద్రను మరోసారి చూపించేందుకు రైమా సేన్ సిద్ధమైంది. తెలుగు ప్రేక్షకులు ఆమె రీ-ఎంట్రీకి ఎలా స్పందిస్తారో చూడాలి.