pawankalyan3

జోరు వానలో సాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన

విజయనగరం :
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ గిరిజన గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. జోరు వానలోనూ పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన సాగింది.
గిరిజన గ్రామాల్లో పవన్ కళ్యాణ్ కాలి నడకన పర్యటిస్తూ అక్కడ స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో అంతర్గత రహదారులను పరిశీలించి అధికారులకు ఆదేశాలిచ్చారు. మక్కువ మండలం, కవిరిపల్లి గ్రామం ప్రారంభం నుంచి చివర వరకు నడిచారు. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించారు. కొండలు జలపాతాలను స్వయంగా మొబైల్ లో బంధించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, సిద్దవటంతోపాటు ఇక్కడ అడ్వంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని.. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖకు తెలియచేయాలని అధికారులకి సూచించారు.
శంబర గ్రామంలో శ్రీ పోలమాంబ ఆలయం వద్ద పనికి ఆహార పథకం నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు. రోడ్డు క్వాలిటీ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను తెలుసుకున్నారు. కొత్త రోడ్డును తన మొబైల్ లో వీడియో తీసుకున్నారు.

Advertisements
Related Posts
New Rules: అమల్లోకి వచ్చిన 6 ముఖ్యమైన మార్పులు ఇవే..
అమల్లోకి వచ్చిన 6 ముఖ్యమైన మార్పులు ఇవే..

కొత్త ఆర్థిక సంవత్సరం 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఫైనాన్స్, బ్యాంకింగ్, పెన్షన్ వంటి ఇతర చాలా ఆర్థిక సంబంధమైన విషయాలకు ఇది చాలా Read more

దీపావళి ఎడిషన్‌ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
Diwali edition launched by Telangana Govt

హైదరాబాద్‌: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, ప్రభుత్వం. HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌లో HIJS (హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో) - దీపావళి ఎడిషన్‌ను Read more

Trump Tariffs: చైనా అమెరికా సుంకాల వార్.. మనదేశంపై ప్రభావం ఎంత?
చైనా అమెరికా సుంకాల వార్ మనదేశంపై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్య కారణంగా చైనా ఇబ్బందుల్లో పడింది. తాజాగా ట్రంప్ చైనాపై సుంకాలను 125%కి పెంచిన సంగతి మీకు తెలిసిందే. అయితే Read more

Day In Pics: జ‌న‌వ‌రి 08, 2025
day in pic 8 1 25 copy

అస్సాంలోని ఉమ్రాంగ్సో ప్రాంతంలో బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక చర్యలు నిర్వ‌హిస్తున్న అధికారులు న్యూ ఢిల్లీలో బుధ‌వారం నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) రిపబ్లిక్ Read more

×