lorry cleaner was burnt ali

జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం

జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీ ని వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలు మంటలు చెలరేగాయి. వ్యాను ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. హైవేపై భోగాపురం సమీపంలో నారు పేట పెట్రోల్ బంకు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యాన్ వెళ్తోంది. నారు పేట వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ఇసుక లారీ ని ఢీ కొట్టింది. దీంతో వ్యాన్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఢీకొట్టిన సమయంలో వ్యాన్లో చిక్కుకున్న క్లీనర్ బయటికి రాలేకపోవడంతో సజీవ దహనం అయ్యాడు. సిఐ ప్రభాకర్, ఎస్సై లు పాపారావు, సూర్య కుమారి, హైవే సిబ్బంది చేరుకొని జాతీయ రహదారిపై వెళ్తున్న మిగతా వాహనాలకు మనుషులు తగలకుండా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వ్యాన్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.

Related Posts
నిమిషం నిబంధనతో పరీక్ష మిస్
Miss the test with minute rule

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-3 పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు గ్రూప్‌-3 Read more

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
kodalinani

వైసీపీ నేతలపై , వైసీపీ సోషల్ మీడియా వారిపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్ల వైసీపీ హయాంలో చేసిన అక్రమాలకు , Read more

సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు
సీఎంని కలిసిన తర్వాత దిల్ రాజు వ్యాఖ్యలు

‘సంక్రాంతి సినిమాలు, టిక్కెట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇప్పుడు ముఖ్యం కాదు’: దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని Read more

‘ది టీచర్ యాప్’ను ఆవిష్కరిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Union Education Minister Dharmendra Pradhan unveiling The Teacher App

వివిధ రకాల ఉపాధ్యాయ అభ్యసన స్టైల్స్ కు మద్దతు ఇవ్వడానికి ది టీచర్ యాప్ ఉచిత, మంచి-క్వాలిటీ కలిగిన, ఇంటరాక్టివ్ డిజిటల్ వనరులను అందిస్తుంది. సృజనాత్మక మరియు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *