Vote In India

జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ ఆమోదం

గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ జమిలి ఎన్నికలపైనే. ఎట్టి పరిస్థిలోను జమిలి ఎన్నికలను జరిపితీరుతాం అని బీజేపీ పేరొనట్లుగానే జమిలి ఎన్నికల(వన్ నేషన్ – వన్ ఎలెక్షన్)కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమిలికి ఆమోదముద్ర వేసింది. జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశంలో వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండటం… దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందని ఎన్డీయే ప్రభుత్వం తొలి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. తొలి దశలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని... ఆ తరువాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది.అయితే ఈ నిర్ణయాన్ని ఇండియా కూటమి వ్వతిరేకిస్తుంది. ఈ బిల్లుని ఆమోదించకూడదని కూటమి ఆలోచనగా ఉంది.

Advertisements
Related Posts
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ మద్దతు
sc reservation

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ కొనసాగుతున్న సమయంలో, బీఆర్ఎస్ పార్టీ తన సపోర్ట్ క్లియర్‌గా ప్రకటించింది. అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Read more

Jetwani: :కేసుల నుంచి విముక్తి కల్పించండి : చంద్రబాబును కోరిన నటి జెత్వానీ
కేసుల నుంచి విముక్తి కల్పించండి : చంద్రబాబును కోరిన నటి జెత్వానీ

వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని… ఆ కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ముంబై నటి జెత్వానీ కోరారు. Read more

కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ “షాప్ అండ్ విన్ కార్” ఆఫర్
Kisna Diamond & Gold Jewelery brings joy with its Shop and Win Car offer

గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ , సత్తెనపల్లిలోని Read more

JD Vance : అక్షర్ధామ్ ఆలయంలో జేడీ వాన్స్ దంపతులు
JD Vance Akshardham Temple

భారత్ పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య, పిల్లలతో కలిసి ఢిల్లీలోని ప్రసిద్ధ అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు Read more

Advertisements
×