devara movie

జపాన్‌లో దేవర సినిమా సందడి.

బాహుబలి మరియు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో రాజమౌళి జపాన్‌లో తెలుగు సినిమాలకు ఓ కొత్త విభాగాన్ని తెచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ తో ఎన్టీఆర్‌కి జపాన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. జపాన్ ప్రేక్షకుల అభిమానం కారణంగా,ఎన్టీఆర్‌ దేవర సినిమాతో అక్కడకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమా త్వరలో జపాన్‌లో విడుదల కానుంది.ఆర్‌ఆర్‌ఆర్‌ జపాన్‌లో సూపర్ హిట్‌ కావడంతో, అక్కడి ప్రేక్షకులలో ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది.ఆర్‌ఆర్‌ఆర్‌ ఆడిన ప్రదేశాలలో అత్యధిక రోజులు ఆడిన విదేశీ సినిమాగా రికార్డు సృష్టించింది.ఈ విజయంతో,దేవర సినిమాను జపాన్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.బాహుబలి తరువాత, ప్రభాస్ నటించిన కల్కి 2898 జనవరిలో జపాన్‌లో విడుదల కానుంది.కల్కి చిత్రం ఇప్పటికే అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కల్కి తర్వాత, దేవర జపాన్‌లో విడుదల కావడం ఒక పెద్ద ఈవెంట్‌గా మారుతోంది. దేవర కోసం జపనీస్ భాషలో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

2025 మార్చి 28న సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు.జపాన్‌లో ఎన్టీఆర్‌కి ఉన్న భారీ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని, “దేవర” సినిమా అక్కడ పెద్ద విజయాన్ని సాధించాలని స్థానిక డిస్ట్రిబ్యూటర్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ₹500 కోట్ల వసూళ్లను సాధించింది. 2025 లో జపాన్‌లో “దేవర” ఎలా ఫెర్ఫామ్ చేస్తుందో, ఆ పై అవి ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులను ఎంత వరకు ఆకర్షిస్తాయో చూడాలి. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆయుధ పూజ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఆయుధ పూజ సన్నివేశాలు జపాన్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. జపాన్‌లో “దేవర” బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందనే భావన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌లో ఎక్కువైంది.

Related Posts
క్యాన్సర్ రోగులకు ఆశాజనకంగా సెయింట్ జూడ్స్
St. Jude's as hope for cancer patients

హైదరాబాద్‌: సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్స్ (సెయింట్ జూడ్స్ ఇండియా) హైదరాబాద్‌లో కొత్త సదుపాయం ప్రారంభించింది. క్యాన్సర్ చికిత్స పొందుతున్న పిల్లలకు సురక్షితమైన, పరిశుభ్రమైన Read more

మూడు వేరియంట్లలో హీరో డెస్టినీ 125
Hero Destiny 125 in three variants

హీరో మోటోకార్ప్, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్ల తయారీ సంస్థ, సరికొత్త డెస్టినీ 125 విడుదలతో 125cc స్కూటర్ సెగ్మెంట్‌ను ఉత్తేజపరిచేందుకు సిద్ధంగా ఉంది. అర్బన్ Read more

150 గంటల్లో నిర్మిత ఫ్యాక్టరీ భవనాన్ని నిర్మించే సవాలును స్వీకరించిన ఈప్యాక్ (EPACK)ప్రిఫ్యాబ్..
EPACK Prefab took on the challenge of building a factory building in 150 hours

న్యూఢిల్లీ: భారతదేశపు ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులైన ఈప్యాక్ (EPACK)ప్రిఫ్యాబ్, అధునాతన ప్రిఫ్యాబ్ మరియు పీఈబీ సాంకేతికతను ఉపయోగించి రికార్డు స్థాయిలో 150 గంటల్లో భారతదేశపు అత్యంత Read more

మిరె అసెట్ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్‌ విడుదల
Mirae Asset Small Cap Fund is launched by Mirae Asset Mutual Fund

మిరె అసెట్ స్మాల్ క్యాప్ ఫండ్‌ను విడుదల చేసిన మిరె అసెట్ మ్యూచువల్ ఫండ్..ప్రధానంగా స్మాల్ క్యాప్ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ ఈక్విటీ పథకం.. కీలక Read more