electric bike explodes in j

జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్..కొన్న 40 రోజులకే

తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటే..మరోపక్క ఎలక్ట్రిక్ బైక్లు పేలుతున్న ఘటనలు వాహనదారులకు షాక్ కలిగిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో కొన్న 40 రోజులకే ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రూరల్(Jagtial) మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన బెతి తిరుపతి రెడ్డి 40 రోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. కాగా, ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాలలోనే బైక్‌ బాంబు ల పేలింది. బైక్ డిక్కీలోనే ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు రూ 1.90 లక్ష ఉన్నట్టు బాధితుడు వాపోయాడు. కొని నలభై రోజులైనా కాకముందే బైక్ పేలడంపై బాధితుడి కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోపక్క ఈవీలపై రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాహన కాలుష్యాన్ని నియంత్రించే ప్రధాన లక్ష్యంతో 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్‌ మోటారు వాహనాలకు రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఫీజును మినహాయించినట్లు తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శబ్ద, వాయు కాలుష్యాన్ని నిరోధించే ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలు, కార్లు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులకు రోడ్‌ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ చార్జీలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మరి ఇప్పుడు ఇలా వాహనాలు పేలిపోతుంటే ఎలా కొనుగోలు చేసేదని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.

జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్

జగిత్యాల రూరల్ మండలం బాలపెల్లి గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాలలోనే పేలిన ఎలక్ట్రిక్ బైక్.

కొని నలభై రోజులైనా కాకముందే బైక్ పేలడం పై బాధితుడు బెతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన.

బైక్ డిక్కీలోనే వరి ధాన్యం డబ్బులు సుమారు రూ… pic.twitter.com/xQAzWYNO0C— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024

Related Posts
తెలుగువారు మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ఏడుగురు తెలుగువారు దుర్మరణం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ఏడుగురు తెలుగువారు దుర్మరణం మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. ఈ Read more

కులగణనపై పీసీసీ ప్రజెంటేషన్
Caste Census bhatti

ఎస్సీలను వర్గీకరించాలా? లేక సమూహంగా కొనసాగించాలా?.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ Read more

జనసేన ఆవిర్భావ దినోత్సవంలో పలు భాషల్లో ప్రసంగించిన పవన్
pawan janasena

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు భాషల్లో ప్రసంగించి అందరి Read more

CM Chandrababu : పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి పై విచారణకు సీఎం ఆదేశం
CM Chandrababu orders inquiry into Pastor Praveen Kumar death

CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు విచారం Read more