nimmala

జగన్ విద్యుత్ రంగాన్ని నాశనం చేసారు : నిమ్మల

జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
పాలకొల్లు నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో రూ .3 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం నాడు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు. జన్ కో నుంచి ఐదు రూపాయలకే యూనిట్ కరెంటు లభించే అవకాశం ఉండగా కమిషన్ల కోసం రూ. ఎనిమిది నుంచి 14 రూపాయలకు జగన్ కొనుగోలు చేశారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన జగన్ ఇంటి ముందే వైసీపీ శ్రేణులు ధర్నాలు చేయాలన్నారు. గత చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీలను పెంచకపోవడమే కాకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Related Posts
YS Sunitha: గవర్నర్ తో సునీత భేటీ
YS Sunitha: గవర్నర్ తో సునీత భేటీ

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అయినా న్యాయం జరగడం లేదని ఒకరు తప్ప మిగిలిన నిందితులు అందరూ బయట తిరుగుతున్నారని వైఎస్‌ Read more

మాతృభాషపై మమకారం ఉండాలి: జస్టిస్ ఎన్వీ రమణ
ramana

తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుంది అని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలో సుప్రీంకోర్టు Read more

ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ విజ్ఞప్తి
Set up defense cluster in AP.. Lokesh appeals to Rajnath Singh

న్యూఢిల్లీ: రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేశ్ ఈనెల Read more

దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు
Chandrababu Naidu is the richest Chief Minister in the country

న్యూఢిల్లీ: దేశంలోనే ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. అసోసియేషన్‌ Read more