bhaskar reddy

చెవిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన ఓ కేసులో హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆంధ్రారాజకీయాలలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తనపై టీడీపీ కక్ష రాజకీయాలు చేస్తున్నదని, తనకు సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారని, కావున ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. చెవిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు తదుపరి విచాణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మరోవైపు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Related Posts
ఆన్ లైన్ లోనూ జనరల్ టికెట్ అందుబాటు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు
ఆన్‌లైన్‌లో జనరల్ టికెట్ బుకింగ్! క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! జనరల్ టికెట్ కొనుగోలు కోసం ఇక స్టేషన్లలో గంటల తరబడి క్యూలో నిలబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని Read more

“సరస్వతి పవర్” భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరియు ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల Read more

టీడీపీలోకి కరణం బలరామ్.. ?
karanam balaram

వైసీపీ సీనియర్ నేత కరణం బలరామ్ పార్టీ మారతారని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన త్వరలోనే టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. Read more

అరసవల్లిలో కన్నుల పండుగగా రథసప్తమి వేడుకలు..
11

అరసవల్లి: రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం, అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ స్వామివారికి Read more