changanti

చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు-నైతికత విలువల సలహాదారు పదవిలో కేబినెట్ హోదాతో ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. ఈ పదవిని స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు చాగంటి. త్వరలోనే ఆయన పూర్తిస్థాయి బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు మరో ముఖ్యమైన బాధ్యత అప్పగించింది.
రాష్ట్ర నైతికత, విలువల ప్రభుత్వ సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేయించాలని సర్కారు నిర్ణయించింది. రెండ్రోజుల కింద కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను చాగంటితో రూపొందించి పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇదే సమయంలో కేజీ నుంచి పీజీ దాకా ఇంటిగ్రేట్ చేస్తూనే.. స్టూడెంట్స్‌కు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక తయారు చేయాలనే మరో నిర్ణయం కూడా తీసుకుంది. సర్కారు బడుల్లో చదివే వారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ కింద కిట్లు అందజేయాలని నిర్ణయంచింది. దేశంలో యువతలో నైతిక విలువలు పతనం అవుతున్నాయి. చిన్న వయసులోనే చేడు వ్యసనాల బారిన పడుతున్నారు. దేశ భవిత యువత చేతిలోనే వుంది. వీరికి నైతిక విలువలతో కూడిన విద్యను అందించవలసిన బాధ్యత అందరిపై వుంది.

Advertisements

Related Posts
మూతబడ్డ శ్రీవారి వైకుంఠ దర్శనం కౌంటర్లు
ttd counters

తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్లు క్లోజ్ అయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసిన టీటీడీ సిబ్బంది.. Read more

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌
ap cabinet

ఏపీ కేబినెట్‌పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో రూ. 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి Read more

TDP: టీడీపీ మహిళా నేతపై కేసు ఎందుకంటే?
TDP: టీడీపీ మహిళా నేతపై కేసు ఎందుకంటే?

విశాఖ టీడీపీ మహిళా నేతపై పోలీస్ కేసు: అసలేమైందంటే? విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఇప్పుడు న్యూస్‌లోకి వచ్చారు. Read more

Kurnool Murder : టీడీపీ నేత హత్య తో కర్నూలులో ఉద్రిక్తత
Kurnool Murder : టీడీపీ నేత హత్య తో కర్నూలులో ఉద్రిక్తత

కర్నూలులో టీడీపీ నేత హత్య – రాజకీయ రంగంలో కలకలం కర్నూలులో చోటుచేసుకున్న టీడీపీ నేత హత్య ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. నగరంలోని శరీన్‌నగర్‌లో నివాసం Read more

×