No increase in reservation for BCs without legislation. Srinivas Goud

చట్టం లేకుండా బీసీలకు రిజర్వేషన్లు పెరగవు : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ..బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేస్తే పూర్తిగా సహకరిస్తామని అన్నారు. చట్టం లేకుండా బీసీలకు రిజర్వేషన్లు పెరగవన్నారు. చట్టం చేయకపోవడంతో బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాలలో రిజర్వేషన్ల పెంపును కోర్టులు కొట్టివేశాయని గుర్తు చేశారు.

Advertisements

బీసీ కుల గణనను రాజ్యాంగం ఆర్టికల్ నెంబర్ 242, 343ల ప్రకారం పగడ్బందీగా చేయాలని తెలిపారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని.. చాలా రోజుల తర్వాత బీసీ జనాభా లెక్కించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే చట్టాన్ని తయారు చేసుకోకుండా సర్వే చేస్తున్నారని అన్నారు.

రెండు వేరువేరు జీవోలు ఇచ్చారని, వీటి వల్ల మళ్ళీ కాలయాపన జరిగే ప్రమాదం ఉందని అట్టడుగు వర్గాలలో ఆందోళన ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ కుల గణన ఓ ఎక్స్రే లాంటిదని అంటున్నారని.. మేము ఎమ్మారై లాంటిదని అంటున్నామన్నారు. కులాలు, ఉప కులాల జనాభా సర్వే తో కచ్చితంగా తేలుతుందన్నారు. బీసీ కమిషన్ జిల్లాల్లో పర్యటనలను జిల్లా కలెక్టర్లు పట్టించుకోవడంలేదని.. బీసీ కమిషన్ ను అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అఖిలపక్ష సమావేశం, అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి కులగననకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయాపరమైన చిక్కులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా తమ సూచనలు, సలహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

Related Posts
వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ ఉద్రిక్తత
వరంగల్ ఎయిర్‌పోర్టు

వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ ఉద్రిక్తత.. సర్వేను అడ్డుకున్న రైతులు హన్మకొండ బ్యూరో, మార్చి 4, ప్రభాత వార్త: మామునూరు ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్ Read more

Kodali Nani: నాని ఆరోగ్యంపై వైద్యుల కీలక ఆదేశాలు
Kodali Nani: నాని ఆరోగ్యంపై వైద్యుల కీలక ఆదేశాలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా నిలిచిన మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సేవలందించిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని ఆరోగ్యం పై కీలక Read more

ఏపీలో మొరాయిస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు
Servers of registration dep

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో భారీ రద్దీ నెలకొంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానున్న నేపథ్యంలో, ప్రజలు గుత్తుగా Read more

కృష్ణవేణి మృతిపట్ల చంద్రబాబు సంతాపం
krishnaveni dies

తెలుగు సినీ పరిశ్రమకు విశేషమైన సేవలు అందించిన అలనాటి నటి, ప్రముఖ నిర్మాత కృష్ణవేణి (102) ఇకలేరు. వయోభారంతో హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు. Read more

×