srikakulam accident

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం

కంచిలి మండలం పెద్ద కొజ్జియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా… మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి జాజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

మృతుల వివరాలు: కదిరిశెట్టి సోమేశ్వరరావు(48) ఎం లావణ్య(43), స్నేహగుప్తా(18) దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నం సీతమ్మధార నుండి ఒరిస్సాలోని జాజిపూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Related Posts
త‌ల్లితో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్న వైఎస్ జ‌గ‌న్‌
jagan2

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాలుగు రోజుల క‌డప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ పులివెందుల సీఎస్ఐ చ‌ర్చిలో జరిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో Read more

తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో 26 రైళ్లకు హాల్ట్ లు
train

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు Read more

ఏపీలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్నవారిపై కేసులు
ఏపీలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్నవారిపై కేసులు

బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన యూట్యూబర్ల లెక్కలు తేలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇందుకోసం స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. చట్టరీత్యా నేరం అయినా.. సోషల్ మీడియాలో బెట్టింగ్ Read more

సీఎం చంద్రబాబుతో డీజీపీ గుప్తా భేటీ
DGP Gupta met with CM Chand

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా Read more