exame33

గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌పై అనుమానాలు వద్దు

గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు మెరిట్ ప్ర‌కార‌మే అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్‌సీ ఛైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం అన్నారు. రేపు, ఎల్లుండి జ‌ర‌గ‌నున్న గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు టీజీపీఎస్‌సీ ఛైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం అన్నారు. నాంప‌ల్లిలోని టీజీపీఎస్‌సీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌రీక్ష‌లు పూర్తిగా సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రుగుతాయ‌ని, అభ్య‌ర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహ‌లు పెట్టుకోకుండా ఎగ్జామ్స్ రాయాలని తెలిపారు.
ఇక ప్ర‌శ్న ప‌త్రాల‌కు సంబంధించి 58 చోట్ల స్టోరేజ్ పాయింట్లు పెట్టామ‌న్నారు. అభ్యర్థికి త‌ప్ప ప్ర‌శ్నాప‌త్రం ఎవ‌రికీ తెలిసే ఛాన్సే లేద‌న్నారు. ఈసారి 5.51 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల ప‌రీక్ష‌లు రాయ‌నుండ‌గా, అంద‌రికీ బ‌యోమెట్రిక్ త‌ప్ప‌నిస‌రి చేశామ‌న్నారు. టీజీపీఎస్‌సీపై న‌మ్మ‌కముంచి అభ్య‌ర్థులు ప‌రీక్ష‌లు రాయాల‌ని, మెరిట్ ఉంటే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని బుర్రా వెంక‌టేశం చెప్పుకొచ్చారు.
2015లో గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ అమలుకు చాలా స‌మ‌యం తీసుకున్నారని, ఈసారి తొంద‌ర‌గానే ఫ‌లితాలు విడుద‌ల చేస్తామ‌న్నారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎక్క‌డా ఎలాంటి లోటుపాట్లు లేకుంగా ప‌ది రోజులుగా అన్ని అంశాల‌ను స‌మీక్షించిన‌ట్లు తెలిపారు.

Advertisements
Related Posts
కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
cm revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం దిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా హాజరుకానున్నారు. రాష్ట్ర Read more

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
Amaravati తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం

Amaravati : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమలను తలపించేలా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. Read more

తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
Justice Sujoy Paul as the new CJ of Telangana High Court

హైరదాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా Read more

Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయంగా మారబోతున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో Read more

×