vennela

గద్దర్ కూతురికి కీలక పదవి కట్టబెట్టిన రేవంత్ సర్కార్

గద్దర్‌ కూతురు డాక్టర్‌ గుమ్మడి వెన్నెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు డాక్టర్‌ వెన్నెలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ సెక్రటరి వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో గద్దర్ అభిమానులు, సాంస్కృతిక వేదికతో సంబంధాలున్న అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరైన వ్యక్తికి.. సరైన విభాగంలోని బాధ్యతలు అప్పగించారని ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయంతో.. ఓ వైపు సాంస్కృతిక రంగానికి ఏం చేయాలో చిన్నప్పటి నుంచి అవగాహన ఉన్న వ్యక్తిని నియమించారనే సంతృప్తితో పాటు.. ప్రజాభిమాన గాయకుడికి నివాళులు అర్పించినట్లైందని అంటున్నారు.

గద్దర్ సేవల్ని గుర్తిస్తూ.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే.. ఏటా సినిమాకు అందించే అత్యుత్తమ పురస్కారాలైన నంది అవార్డులకు.. గద్దర్ పురస్కారాలుగా పేరు మార్చి గౌరవించింది. హైదరాబాద్ లోని తెల్లాపూర్ పరిధిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి, గద్దర్ పై అభిమానాన్ని చాటుకుంది. ఇప్పుడు.. ఆయన వారుసురాలికి మంచి పదవి ఇచ్చి.. మరోసారి సత్కరించుకుంది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక కళాకారులకు గుర్తింపు, ఉపాధిని కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేశారు. ఇందులోని కళాకారులు కళాబృందాలుగా ఏర్పడి సామాజిక దురాచారాలు, మూఢనమ్మకాలపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రచారం చేయిస్తారు. కళా ప్రదర్శనలకు అనువైన శిక్షణనివ్వడానికి, వర్క్ షాపులు నిర్వహించడానికి సాంస్కృతిక సారథి సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తుంది. గ్రామ గ్రామాన అట్టడుగు స్థాయిలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేరేలా వ్యవహరిస్తారు.

Related Posts
వింత వ్యాధితో 17 మంది మృతి..ఎక్కడంటే..!
'mysterious deaths'

జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా బుధాల్ గ్రామంలో వింత వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి కారణంగా రెండు కుటుంబాల్లో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. Read more

శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం!
A plane narrowly missed a major accident in Shamshabad! copy

హైదరాబాద్‌: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర విమానం ప్రమాదం తప్పింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని Read more

కుళ్ళిన చికెన్ విక్రయిస్తున్నారు జర జాగ్రత్త!
కుళ్ళిన చికెన్ విక్రయిస్తున్నారు జర జాగ్రత్త!

హైదరాబాద్‌లో సరికొత్త దందా బయటపడింది. సికింద్రాబాద్ బేగంపేట్ ప్రాంతంలో, అన్నానగర్‌లోని పలు చికెన్ సెంటర్లపై ఆహారభద్రత మరియు టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో Read more

మహారాష్ట్రలో దూసుకుపోతున్న ఎన్డీయే కూటమి
Maharashtra assembly polls results

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అధికార పార్టీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ 145 స్థానాలను దాటిన మహాయుతి.. ప్రస్తుతం Read more