KTR Congress

కేటీఆర్‌ఫై విచారణకు గవర్నర్ ఆమోదం

తెలంగాణలో చలికాలంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. ఇక్కడి రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకోనుంది. ఫార్ములా ఈ-కారు రేసులో అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్‌ వ‌ర్మ ఆమోదం తెలిపారు. దీంతో అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ).
భారీ నిధుల అవినీతి
బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో హైద‌రాబాద్ వేదిక‌గా గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో ఫార్ములా ఈ-కారు రేస్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఫార్ములా ఈ-కారు రేసు నిధుల కేటాయింపుల‌లో భారీ అవినీతి జ‌రిగిన‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ సంస్థ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.

దీంతో ఈ కేసులో ఇప్ప‌టికే ఉన్న‌ ఇద్ద‌రు పుర‌పాల‌క శాఖ అధికారుల‌తో పాటు అప్ప‌ట్లో రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌పై కేసు న‌మోదు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఏసీబీ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ప్ర‌భుత్వం ఇద్ద‌రు అధికారుల‌పై విచార‌ణ‌కు అనుమ‌తించింది. అలాగే ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న కేటీఆర్‌పై కేసు న‌మోదు కోసం అనుమ‌తి ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కోరింది. దీనిపై న్యాయ స‌ల‌హా మేర‌కు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ కేటీఆర్‌ను విచారించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు.
తమపై రాజకీయ కక్ష చేస్తున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. నేరుగా తమను ఎదుర్కొనలేక తప్పుడు కేసులతో కాంగ్రెస్ పార్టీ తమను ఇబ్బందికి గురిచేస్తునట్లు బీఆర్ఎస్ చెపుతున్నది.

Related Posts
అత్యాచారం కేసు..ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ
Rape case.Prajwal Revanna bail petition rejected

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణకు ఈరోజు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న Read more

పేద మహిళలకు ఉచిత  సిజేరియన్ శస్త్రచికిత్సలు: నైజీరియా ప్రభుత్వం
pregnancy

నైజీరియా ప్రభుత్వం పేద మహిళలకు ఉచిత  సిజేరియన్ శస్త్రచికిత్సలు అందించడానికి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గర్భిణీ మహిళలకు ప్రయోజనం Read more

కాబోయే భర్త ఫోటో ను విడుదల చేసిన కీర్తి సురేష్
keerthi wedding

కీర్తి సురేష్ తన కాబోయే భర్త ఫొటోను షేర్ చేసింది. ఆంటోనీతో నా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతుంది అంటూ కాబోయే భర్తను పరిచయం చేసింది. Read more

షర్మిల, విజయమ్మపై పిటిషన్.. స్పందించిన జగన్
New law in AP soon: CM Chandrababu

తన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మపై వేసిన పిటిషన్ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తన చెల్లి షర్మిల Read more