liquid thrown on arvind kej

కేజ్రీవాల్‌పై దాడికి యత్నం

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ట్రై చేసారు. ఆయనపై ఒక వ్యక్తి ద్రవ పదార్థం (లిక్విడ్) విసిరిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఆప్ సీరియస్‌గా స్పందిస్తూ, ఇది సామాన్య దాడి కాదని, పధకం తోనే ఆసిడ్ దాడి అని ఆరోపించింది. అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకోవడంతో అరవింద్ కేజ్రీవాల్ ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. అక్కడే ఉన్న కార్యకర్తలు యువకుడిని పట్టుకుని చితకబాదారు.

Advertisements

అత‌డి వ‌ద్ద ఉన్న‌ బాటిల్‌ను పరిశీలించగా అందులో స్పిరిట్ ఉన్నట్లు తేలిందని ఆప్ నేతలు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీనికి ముందు కేజ్రీవాల్ ప్రసంగిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళనవ వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్ స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన ఘటన ఇదే మొదటిసారి కాదు. 2016లో రాజస్థాన్‌లోని బికనెర్‌లో పర్యటించినప్పుడు ఆయనపై దాడి యత్నం జరిగింది. 2013లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు ఆయనకు కొత్తకాదు.

Related Posts
త్వరలో అంతరిక్ష కేంద్రం సిద్ధం
indian space station 181852770 16x9

ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీలో వేగంగా డెవలప్ అవుతుంది. అందులో భాగంగా భారతదేశం 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోనుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ Read more

Sudheer Reddy : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు
Case registered against MLA Sudheer Reddy

Sudheer Reddy : రంగారెడ్డిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. తనను దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు Read more

ఎంపీలతో రాహుల్ గాంధీ భేటీ
Rahul Gandhi met MPs

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న Read more

Indian Air Force:తేజస్ యుద్ధవిమానాల డెలివరీకి గ్రీన్ సిగ్నల్
Indian Air Force తేజస్ యుద్ధవిమానాల డెలివరీకి గ్రీన్ సిగ్నల్

Indian Air Force:తేజస్ యుద్ధవిమానాల డెలివరీకి గ్రీన్ సిగ్నల్ భారత వాయుసేన కోసం తయారవుతున్న తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలకు అవసరమైన ఎఫ్‌-404 ఇంజిన్ల సరఫరా ఎట్టకేలకు ప్రారంభమైంది. Read more

×