Manmohan Singh

కుమార్తె వచ్చాకే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన కాసేపటికే తుది శ్వాస విడవడం తెలిసిందే. మన్మోహన్ భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీలోని నివాసంలో ఉంది. కాగా, మన్మోహన్ సింగ్ కుమార్తెల్లో ఒకరు అమెరికా నుంచి రావాల్సి ఉండడంతో, ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. ఆమె అమెరికాలో విమానం ఎక్కినట్టు తెలుస్తోంది. నేటి అర్ధరాత్రి తర్వాత భారత్ చేరుకుంటారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ వెల్లడించారు. ఆయనకు పూర్తిస్థాయి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని కప్పి ఉంచారు. రెండు పర్యాయాలు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ ఇక లేరన్న వార్త తెలిసి యావత్ భారతావని విచారంలో మునిగిపోయింది.
ఇక, ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నామని, అయితే దీనికి సంబంధించిన కార్యాచరణ మన్మోహన్ కుమార్తె వచ్చాక ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.

Advertisements
Related Posts
Waqf Board: వక్ఫ్ బిల్లుపై వాడీవేడిగా లోక్ సభలో చర్చలు
Waqf Board: వక్ఫ్ బిల్లుపై వాడీవేడిగా లోక్ సభలో చర్చలు

వక్ఫ్ చట్ట సవరణ బిల్లు 2025: లోక్‌సభలో హాట్ టాపిక్ కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు-2025ను ప్రవేశపెట్టింది. ఈ కీలకమైన బిల్లుపై Read more

కేజ్రీవాల్ మరో కీలక హామీ ప్రకటన
arvind kejriwal

చలికాలంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. బీజేపీ, అప్ ప్రధాన పార్టీలు హామీల గుప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య Read more

Elon Musk: ట్రంప్ ఎఫెక్ట్ తో వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మస్క్
ట్రంప్ ఎఫెక్ట్ తో వరల్డ్ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలాన్ మస్క్

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. టెస్లా స్టాక్ విలువ పెరగడంతో ఎలాన్ మస్క్ సంపద 82 శాతం వృద్ధి Read more

Delhi Election Results: ఎర్లీ ట్రెండ్స్‌లో కేజ్రీవాల్‌కు బీజేపీ బిగ్ షాక్ !
BJP big shock for Kejriwal in early trends

న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం Read more

×