CM Chandrababu gets relief in Supreme Court..

కుప్పంకు కొత్త వరాలు ప్రకటించనున్న చంద్రబాబు

తెలుగు దేశం భారీమెజార్టీతో గెలుపు పొందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంకు కొత్త వరాలు ప్రకటించనున్నారు. ఈ రోజు నుంచి తన సొంత నియోజక వర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ‘స్వర్ణ కుప్పం’ విజన్-2029′ డాక్యుమెంట్​ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పీఎం సూర్యఘర్‌ పథకం పైలెట్ ప్రాజెక్టు కుప్పంలో అమలు చేయనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు కుప్పంకు కొత్త వరాలు ప్రకటించే అవకాశం ఉంది.


లబ్ధిదారులతో ముఖాముఖి
విజన్ ఆవిష్కరణ కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం మధ్యాహ్నం12.00 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకుని స్వర్ణ కుప్పం విజన్ 2029ను ఆవిష్కరిస్తారు. 2.25 గంటలకు కుప్పం మండలం నడిమూరు గ్రామం చేరుకుని సోలరైజేషన్‌ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.

సాయంత్రం 4 గంటలకు సీగలపల్లి గ్రామం చేరుకుని ప్రకృతి వ్యవసాయ రైతులతో ముచ్చటిస్తారు. పైలెట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికీ సౌర పలకాలు అమర్చాలని నిర్ణయించారు. పీఎం సూర్యఘర్‌ పథకం కింద కుప్పంలోని ప్రజలకు వంద శాతం రాయితీతో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్తును అందించే పథకాన్ని ప్రారంభించనున్నారు.

Related Posts
అమరావతికి 11 వేల కోట్లు ఆమోదించిన హడ్కో
అమరావతికి 11 వేల కోట్లు ఆమోదించిన హడ్కో

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ Read more

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అనర్హులకు నోటీసుల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ Read more

బెంగళూరులో తెలుగు ఐటీ ఉద్యోగులకు షాక్
technology company

ప్రపంచములో ఎక్కడ చూసినా ఒకటే మాట ఉద్యోగులకు భద్రత లేదు. బెంగళూరులోని ఎక్కువ మంది నివసించే వారిలో ఐటీ ఉద్యోగులది సింహభాగం. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల Read more

సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు..ఏపీ సర్కార్‌

అమరావతి: సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో చర్యలు Read more